చిన్న చిన్న దేశాల అవసరాలను తెలుసుకొని వాటికి సహాయం చేసి మెల్లిగా ఆ దేశంలో పాగా వేయడం డ్రాగన్ దేశానికి వెన్నతో పెట్టిన విద్య. గతంతో బ్రిటీష్ పాలకులు చేసిన విధంగానే ఇప్పుడు డ్రాగన్ పాలకులు చేస్తున్నారు. పాక్‌కు కావాల్సనంత డబ్బులు ఇచ్చి ఆ దేశాన్ని తన చెప్పుచేతల్లో పెట్టుకున్నది. ఇటు శ్రీలంకను సైతం అదేవిధంగా తన చెప్పుచేతల్లో పెట్టుకున్నది డ్రాగన్. కాగా ఇప్పుడు దృష్టిని కువైట్‌వైపు మళ్లించింది. కువైట్ ప్రస్తుతం అల్ షకయా ఎకనామిక్ సిటీని నిర్మించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ సిటీ నిర్మాణానికి భారీగా నిధులు అవసరం అవుతాయి. ఈ విషయం తెలుసుకున్న చైనా 16 బిలియన్ డాలర్ల రుణం ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. అంతేకాదు, ఆ సిటీ నిర్మాణాన్ని తాము పూర్తిచేస్తామనే ప్రతిపాదనను కూడా తీసుకొచ్చింది. దీనికి బదులుగా బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్ విధానంలో తమకు రాయితీ కల్పించాలని కోరింది. ప్రస్తుత అవసరాలకు చైనా ఇచ్చిన ఆఫర్ ఆ దేశానికి మంచిదే అయినప్పటికీ భవిష్యత్తులో కువైట్‌ను చెప్పుచేతల్లో పెట్టుకునే అవకాశం లేకపోలేదు. అందుకే కువైట్ ప్రభుత్వం చైనా ఆఫర్‌పై ఆలోచనలో పడింది. చైనా ఆఫర్ కాకుండా మిగతా విధానాల్లో సిటీ నిర్మాణం కోసం నిధులు ఎలా సమకూరే అవకాశం ఉన్నది అనే దానిపై దృష్టి పెట్టాయి.
Read: బెంగాల్ ఉప ఎన్నికలకు కాంగ్రెస్ దూరం… ఆ పార్టీ కోసమేనా…!!