Water Supply: జలమండలిలోని ఓఅండ్‌ఎం డివిజన్-2లోని బాలాపూర్ రిజర్వాయర్ కింద గుర్రం చెరువు నుంచి సన్నీ గార్డెన్స్ వరకు ఎస్‌ఎన్‌డీపీ డ్రెయిన్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. బాక్స్ డ్రెయిన్ నిర్మాణానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బాలాపూర్ రిజర్వాయర్ అవుట్‌లెట్ 450 ఎంఎం డయా పైప్‌లైన్ డైవర్షన్ పనులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. నేడు రాత్రి 9 గంటల నుంచి మరుసటి రోజు శనివారం (రేపు) రాత్రి 8 గంటల వరకు ఈ పనులు జరగనున్నాయి.
Read also: SPY Camera: దారుణం.. ఇంజనీరింగ్ కాలేజీ లేడీస్ టాయిలెట్స్‌లో రహస్య కెమెరా..
దీంతో పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. రాజా నరసింహ కాలనీ, ఇందిరానగర్, పిసల్‌బండ, దర్గా బురాన్‌షాహి, ఘాజీ-మిల్లత్, ఉప్పుగూడ, DMRL, DRDL, గారిసన్ ఇంజనీర్-1, 2, DRDO మిధాని, OYC హాస్పిటల్, BDL, CRPF సెంట్రల్ విద్యాలయం, హస్నాబాద్, ందనగర్, సంతోష్‌నగర్ ఓల్డ్ కాలనీ , యాదగిరి కమాన్ ఎదురుగా ఉన్న ప్రాంతం, MIGH, HIGH, LIGH కాలనీలు, ఫహాబా మసీదు, మారుతీనగర్, పోచమ్మ గడ్డ, హనుమాన్ టైలర్ గల్లీ తదితర ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదని, ప్రజలు తాగునీటిని పొదుపుగా వాడుకుని సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
Read also: MPOX : ఎంపాక్స్ కొత్త, ప్రాణాంతకమైన వేరియంట్.. పిల్లలకు ముప్పు!
మరోవైపు రాయపోల్ గ్రామంలో గత 20 రోజులుగా మంచి నీటి సరఫరా నిలిచిపోవడంతో గ్రామ ప్రజలు ట్యాంకర్లతో నీటిని సేకరిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామంలో గత 20 రోజులుగా మంచినీటి సరఫరా నిలిచిపోవడంతో ఆ గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 20 రోజులుగా మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో గ్రామస్థులు ట్యాంకర్ల నుంచి రూ.700 నుంచి 800 చెల్లించి నీటిని కొనుగోలు చేస్తున్నారు.
Kadambari Jethwani: నన్ను ఆటబొమ్మలా వాడుకున్నారు.. సాక్ష్యాలను ఏపీ పోలీసులకు అందజేస్తా: హీరోయిన్