తిరుమలలో సందడి నెలకొంది. అటు వీఐపీలు, రాజకీయ ప్రముఖులు స్వామివారి సేవలో తరిస్తున్నారు. తాజాగా రంగ రంగ వైభవంగా చిత్ర యూనిట్ తిరుమల ఏడుకొండలపై సందడి చేశారు. హీరో వైష్ణవ్ తేజ్,హీరోయిన్ కీతిక శర్మ,దర్శకుడు గిరీషయా,నిర్మాత బివిఎస్ఎస్ ప్రసాద్ తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. సెప్టెంబర్ 2వ తేదీన రంగ రంగ వైభవంగా చిత్రం విడుదల కానుండడంతో స్వామి వారి ఆశీస్సులు పొందేందుకు వచ్చిన వీరు విఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామి వారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
స్వామి వారి ఆశీస్సులు పొంది…చిత్ర టైటిల్ సాంగ్ ను ఇక్కడే విడుదల చేస్తున్నామని…సెప్టెంబర్ రెండవ తేదీన చిత్రం విడుదల అవుతుందన్నారు. ప్రేక్షకులందరు సినిమాను చూడాలని దర్శకుడు గిరీషయా విజ్ఞప్తి చెయ్యగా…నేడు విశాఖలో చిత్ర ప్రమోషన్ ని ప్రారంభిస్తున్నామన్నారు. రేపు హైదరాబాద్ లో ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని నిర్మాత ప్రసాద్ చెప్పారు.స్వామి వారి దర్శనం బాగా జరిగిందని… ప్రేక్షకులందరు థియేటర్స్ లో చిత్రాన్ని చూడాలని..ఈ చిత్రంలో నా క్యారెక్టర్ సరదాగా వుంటుందని హీరో వైష్ణవ్ తేజ్ చెప్పగా..మొదటి సారి స్వామి వారిని దర్శించుకొని స్వామి వారీ ఆశీస్సులు పొందానని చిత్రం విజయం సాధిస్తుందని హీరోయిన్ కీతిక శర్మ తెలిపారు.
Read Also: Rats Bites Students: అక్కడ ఎలుకలతో విద్యార్ధుల ఇక్కట్లు.. పట్టని అధికారులు