Hero Vishal: కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. చెన్నైలోని అన్నానగర్‌లో తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్న విశాల్ ఇంటిపై ఆగంతకులు రాళ్లతో దాడి చేశారు. దుండగులు ఎర్రటి కారులో వచ్చి ఇంటిపై రాళ్లు రువ్వినట్లు సీసీటీవీ ఫుటేజీలో ఉంది. ఈ దాడిలో విశాల్ ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ దాడిపై విశాల్ తన మేనేజర్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనికి సంబంధించిన రికార్డింగ్‌ను కూడా పోలీసులకు అందించారు. నటుడు విశాల్ షూటింగ్ నిమిత్తం బయటకు వెళ్లిన సందర్భంలో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఇక తమిళ, దక్షిణ చిత్రసీమలో ప్రముఖ నటుడు, తమిళ సినీ పరిశ్రమ నడిగం సంఘం జనరల్ సెక్రటరీ విశాల్ ఇంటిపై దాడి జరగడం సంచలనంగా మారింది.
ఈ దాడి వెనుక ఎవరున్నారు? ఈ దాడి ఎందుకు జరిగింది? అనేది తెలియాల్సి ఉంది. విశాల్‌కి ఇండస్ట్రీలో శత్రువులు లేకపోయినా రాజకీయాల్లో మాత్రం విశాల్‌కి చాలా మంది శత్రువులు ఉన్నారు. నడిగర్ సంఘం ఎన్నికల సమయంలో విశాల్ గెలుపు కోసం కష్టపడ్డాడు. ఆ శత్రువులే ఈ పని చేసి ఉంటారా? కేసునమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.
హీరో విశాల్ ప్రస్తుతం లాఠీ, తుపరివాలన్-2, మార్క్ ఆంటోని చిత్రాల్లో నటిస్తున్నారు. విశాల్ నటిస్తున్న లాఠీ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఇక విశాల్ గత చిత్రాలైన వీరమే వాగై సూదుం, శత్రువు, చక్రం, యాక్షన్ వంటి చిత్రాలు ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాయి. దీంతో.. ప్రస్తుతం లాఠీ సినిమా టీజర్‌కు మంచి స్పందన వచ్చింది… తుప్పరివాలన్ మొదటి భాగం భారీ విజయం సాధించడంతో అభిమానులు తదుపరి భాగం కోసం ఎదురుచూస్తున్నారు.
What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?