ప్రముఖ నిర్మాత గోరంట్ల రాజేంద్రప్రసాద్ కన్నుమూశారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. 1935 ఆగస్ట్ 15న కారంచేడులో జన్మించిన రాజేంద్రప్రసాద్ 1959 నుంచి 65 వరకూ చీరాలలో బెంచ్ మెజిస్ట్రేట్ గా పని చేశారు. ఆ తర్వాత రామానాయుడుతో కలసి కారంచేడులో రైస్ మిల్ నిర్వహించిన రాజేంద్రప్రసాద్ రామానాయుడు, మిత్రుడు జాగర్లమూడి సుబ్బారావుతో కలసి సురేశ్ సంస్థను స్థాపించారు. అందులో రాజేంద్రప్రసాద్, సుబ్బారావుది 40 శాతం. ‘రాముడు-భీముడు, శ్రీకృష్ణ తులాభారం, ప్రతిజ్ఞ, స్త్రీ జన్మ, ఒక చల్లని రాత్రి’ సినిమాలను నిర్మించారు. ఆ తర్వాత ఎ.ఎస్.ఆర్. ఆంజనేయులుతో కలసి ‘బందిపోటు దొంగలు, సుపుత్రుడు, దొరబాబు, వంశోర్ధారకుడు’ చిత్రాలను మాధవి పిక్చర్స్, ఫణి మాధవి కంబైన్స్ బ్యానర్స్ పై తీశారు. ఆ తర్వాత కృష్ణ తో కలసి ‘కురుక్షేత్రం’ సినిమా నిర్మించారు. ఇక ఎన్టీఆర్ తో సొంతంగా వెంకటేశ్వర మూవీ క్రియేషన్స్ పతాకంపై ‘ఆటగాడు’ సినిమా తీశారు. అలాగే ఆర్.సి ఆర్ట్స్ పతాకంపై ‘సంకెళ్ళు’ సినిమాను రూపొందించారు. గోరంట్ల రాజేంద్రప్రసాద్ మృతి పట్ల పలువురు చిత్రప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.