చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు సంబంధించిన ఒక వార్త ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆయన అధికారం నుంచి తప్పుకోబోతున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. కొంతకాలంగా జిన్‌పింగ్ బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉండటం, బ్రిక్స్ సమావేశానికి హాజరు కాకపోవడం ఈ అనుమానాలకు బలం చేకూర్చాయి.
ఆపరేషన్ సిందూర్ సమయంలో చైనా పాకిస్థాన్‌కు సైనిక మద్దతు ఇచ్చిందా? అనే ప్రశ్నపై చైనా ప్రభుత్వం స్పందించింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో చైనా పాక్‌కు సైనిక మద్దతు అందించిందని భారత ఆర్మీ డిప్యూటీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్ ఇటీవల పేర్కొన్నారు. ఈ యుద్ధాన్ని చైనా తన అనేక రక్షణ వ్యవస్థలను పరీక్షించడానికి 'లైవ్ ల్యాబ్'గా ఉపయోగించుకుందని అన్నారు.
India China: చైనా-పాకిస్తాన్-బంగ్లాదేశ్ కలిసి దుష్ట పన్నాగాన్ని పన్నుతున్నాయి. భారత్‌ని చుట్టుముట్టేలా ప్లాన్ చేస్తున్నాయి. ఇటీవల ఈ మూడు దేశాలు కలిసి త్రైపాక్షిక సమావేశాన్ని నిర్వహించాయి. చైనా చరిత్రలో తొలిసారిగా బంగ్లాదేశ్, పాకిస్తాన్‌తో త్రైపాక్షిక సమావేశాన్ని నిర్వహించడం భారత్‌కి ఆందోళన కలిగించే విషయం.
Rajnath Singh: చైనాలో షాంఘై సహకార సంస్థ సమ్మిట్ లో భారత రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఆ తర్వాత బీజింగ్ రక్షణ శాఖ మంత్రి అడ్మిరల్ డాంగ్‌జున్‌తో ఆయన ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడటం, సరిహద్దుల్లో సమస్యలు రాకుండా ఉండేందుకు చేపట్టాల్సిన చర్యలపై వీరిద్దరూ కీలక చర్చలు జరిపినట్లు తెలుస్తుంది.
SCO Summit: భారతదేశం ఉగ్రవాదంపై తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) సమావేశంలో ఉమ్మడి ప్రకటనపై సంతకం చేయడానికి భారత్ నిరాకరించింది. 26 మంది ప్రాణాలను బలిగొన్న పహల్గామ్ ఉగ్రదాడి గురించి ప్రస్తావించకపోవడాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తప్పుపట్టారు.
కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. చైనా ముందే పాకిస్తాన్ పై తీవ్రంగా మండిపడ్డారు. ఇస్లామాబాద్ సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది.. దాన్ని అరికట్టడానికి సరిహద్దు దాటిన టెర్రరిజాన్ని నిర్వీర్యం చేయడానికి మే 7వ తేదీన ఆపరేషన్ సింధూర్ చేపట్టామని పేర్కొన్నారు.
64 ఏళ్ల వ్యక్తికి ఎప్పుడూ కడుపులో నొప్పి కలిగింది. అతను డాక్టర్ దగ్గరకు వెళ్లాడు. పరీక్షించిన వైద్యుడికి షాక్ అయ్యాడు. నిజానికి, ఆ వ్యక్తి కడుపులో ఒక టూత్ బ్రష్ ఇరుక్కుపోయింది. అతను 12 సంవత్సరాల వయసులో అనుకోకుండా దాన్ని మింగేశాడు. 52 ఏళ్లుగా కడుపులోనే ఉంచుకున్నాడట. చైనాకు చెందిన ఈ వృద్ధుడి కడుపులో 52 సంవత్సరాలుగా టూత్ బ్రష్ ఇరుక్కుపోయింది. పరీక్షల అనంతరం.. అతనికి శస్త్రచికిత్స అవసరమని డాక్టర్ చెప్పారు. ఆ వ్యక్తి లోపల నుండి…
ప్రస్తుతం కాలంలో ఎక్కువ రోజులు బతకడం కష్టం. ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా చాలా మంది 60-70 మధ్యలోనే మరణిస్తున్నారు. మరి కొందరు రోగాలు, ప్రమాదాలు సంభవించి మధ్యలోనే మృత్యుఒడికి చేరుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా వృద్ధ తల్లి, కుమార్తెల అసమాన ప్రేమకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
Israel Iran War: మధ్యప్రాచ్యంలో యుద్ధ ఘర్షణ తీవ్రమవుతోంది. ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య ఘర్షణ వాతావరణం ప్రపంచ దేశాలను భయపెడుతోంది. ఇరాన్ అణు కార్యక్రమాలపై శుక్రవారం తెల్లవారుజామున ఇజ్రాయిల్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇరాన్ అణు శాస్త్రవేత్తలతో పాటు, ఇరాన్ మిలిటరీ టాప్ జనరల్స్‌ని హతమార్చింది.
Rare Earth Magnet: అత్యంత అరుదైన ఖనిజాలు(రేర్ ఎర్త్ మెటీరియల్)పై చైనా గుత్తాధిపత్యం భారత్‌కి ప్రమాదంగా మారే అవకాశం ఉంది. భారత్ లో అభివృద్ధి చెందుతున్న ఆటోమొబైల్స్ ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ)ల మార్కెట్‌ను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉందని క్రిసిల్ రేటింగ్స్ తన కొత్త నివేదికలో హెచ్చరించింది.