Low birth rate: ప్రపంచ వ్యాప్తం పలు దేశాలు జనాభా క్షీణతను ఎదుర్కుంటున్నాయి. ప్రతీ ఏడాది ఆ దేశాల్లో జననాల రేటు తగ్గుతోంది. దీంతో ప్రభుత్వమే ప్రజలు పిల్లలు కనేలా ప్రోత్సహించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. జననాల రేటు పడిపోవడంతో చాలా దేశాలు ఇప్పుడు వృద్ధ జనాభా సంక్షోభాన్ని ఎదుర్కుంటున్నాయి. తక్కువ సంతానోత్పత్తి రేటు కారణంగా భవిష్యత్తులో మానవ వనరుల కొరత ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాయి.
India-Russia: యుద్ధ పరిస్థితులు మారుతున్నాయి. ఇప్పుడు అంతా టెక్నాలజీ పైనే యుద్ధాలు ఆధారపడుతున్నాయి. దీంట్లో భాగంగానే పలు దేశాలు తమ సైన్యంలో ఐదో తరం ఫైటర్ జెట్లు ఉండాలని కోరుకుంటున్నాయి. ప్రస్తుతం 5వ తరం యుద్ధ విమానాలు అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే సొంతగా తయారు చేసుకున్నాయి. భారత్ కూడా ఈ ఫైటర్ జెట్ డెవలప్మెంట్ పాజెక్టును ప్రారంభించింది.
Himanta Biswa Sarma: చైనా భారతదేశానికి బ్రహ్మపుత్ర నీటిని ఆపేస్తే పరిస్థితి ఏమిటి..? అని దానిపై అస్సా సీఎం హిమంత బిశ్వ సర్మ స్పందించారు. దీనిపై ఎక్స్‌లో ఒక పోస్ట్‌లో ‘‘భయంతో కాదు, వాస్తవాలు, నేషనల్ క్లారిటీతో ఈ అపోహను తొలగిస్తాం’’ అని అన్నారు. బ్రహ్మపుత్ర భారత్‌కి చేరిన తర్వాత పెరిగే నది అని, కుచించుకుపోయే నది కాదని ఆయన తెలిపారు.
India China: ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్, పాకిస్తాన్‌కి చెందిన చైనీస్ ఆయుధాలను, పరికరాలను తుక్కు తుక్కు చేసింది. ముఖ్యంగా చైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ని దెబ్బకొట్టింది. ఇదే కాకుండా చైనా పాకిస్తాన్‌కి అందించిన PL-15E క్షిపణిని భారత్ కుప్పకూల్చింది. భారత్ ఇటీవల పాకిస్తాన్ ప్రయోగించిన చైనా ఆయుధాల పనితీరుపై వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలపై తొలిసారిగా చైనా ఆర్మీ స్పందించింది. భారత్ చేస్తున్న వ్యాఖ్యల్ని తిరస్కరించింది.
వివాదాస్పద దక్షిణ చైనా సముద్ర ద్వీపంలో అత్యంత అధునాతన బాంబర్లు ప్రత్యక్షమయ్యాయి. 2020 తర్వాత పారాసెల్స్లోని వుడీ ద్వీపంలో హెచ్-6 బాంబర్లు ల్యాండ్ కావడం ఇదే మొదటిసారి.
భారత నావికాదళం త్వరలో కొత్త వ్యూహాత్మక ఆయుధం, స్వదేశీ మైన్ కౌంటర్ మెజర్ వెసల్స్ (MCMVs) ను పొందే అవకాశం ఉంది. నీటి అడుగున దాగి ఉన్న శత్రువుల ల్యాండ్మైన్లను గుర్తించి నాశనం చేయగల సామర్థ్యం కలిగిన 12 నౌకలను రూ.44,000 కోట్ల వ్యయంతో తయారు చేయాలని రక్షణ మంత్రిత్వ శాఖ యోచిస్తోంది.
టెక్నాలజీ అద్భుతమైన ఆవిష్కరణలకు నాంది పలుకుతోంది. ఏఐతో వినూత్న ఆవిష్కరణలు ఉద్భవిస్తున్నాయి. తాజాగా ప్రపంచంలోనే తొలిసారిగా రెండు రోబోల మధ్య బాక్సింగ్ మ్యాచ్ జరిగింది. ఇందులో రోబోలు ఒకరినొకరు తన్నుకుంటూ, గుద్దుకుంటూ ఉన్నాయి. ఒకరిపై ఒకరు పంచ్‌ల వర్షం కురిపించుకున్నారు. అచ్చం మానవ బాక్సింగ్ పోటీల మాదిరిగానే జరిగాయి. ఈ 4.25 అడుగుల పొడవైన రోబోల పోటీని టీవీలో కూడా ప్రసారం చేశారు. Also Read:U16 Davis Cup: ఓడినా సిగ్గు లేదుగా.. ఓవర్ యాక్షన్ చేసిన…
India China: చైనా తన బుద్ధిని చూపిస్తూనే ఉంది. ఉగ్రవాదులకు అండగా నిలుస్తున్న పాకిస్తాన్‌తో పాటు కరుడుగట్టిన ఉగ్రవాదులపై ఆంక్షలు కోసం భారత్ చేస్తున్న అభ్యర్థనను చైనా అడ్డుకున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్‌కు చెందిన ఐదుగురు లష్కరే తోయిబా (ఎల్ఈటీ), జైషే మహ్మద్ (జెఎం) ఉగ్రవాదులను నిషేధించి,
China: విదేశీ అమ్మాయిలతో, అక్రమ వివాహాలకు దూరంగా ఉండాలని బంగ్లాదేశ్‌లోని చైనా రాయబార కార్యాలయం, చైనా పౌరులకు సూచించింది. ఆన్లైన్ మ్యాచ్ మేకింగ్ పథకాల పట్ల జాగ్రత్త వహించాలని కోరింది. చైనా ప్రభుత్వం మీడియా గ్లోబల్ టైమ్స్ నివేదిక ప్రకారం, ‘‘క్రాస్ బోర్డర్ డేటింగ్’’కి లొంగవద్దని చైనీయులను కోరింది.
US Report: యూఎస్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ-2025, వరల్డ్ వైడ్ త్రెట్ అసెస్మెంట్ రిపోర్ట్‌ని విడుదల చేసింది. ఈ నివేదికలో సంచలన విషయాలను వెల్లడించింది. పాకిస్తాన్ తన అస్తిత్వానికి ముప్పుగా భారత్‌ని భావిస్తోంది. ఈ నేపథ్యంలో భారత మిలిటరీ ఆధిక్యతను తట్టుకునేందుకు పాకిస్తాన్, చైనా సాయంతో తన అణ్వాయుధాలను ఆధునీకరిస్తోందని నివేదిక వెల్లడించింది. ఇటీవల, ఆపరేషన్ సిందూర్‌లో భారత్ సత్తా చాటింది. పాకిస్తాన్ సైన్యాన్ని కాళ్ల బేరానికి తెచ్చింది. ఈ నేపథ్యంలో ఈ నివేదిక అంశాలు సంచలనంగా…