Mark Rutte: రష్యాతో స్నేహం చేస్తే దెబ్బతింటారు.. భారత్, చైనాకు నాటో చీఫ్ వార్నింగ్
- రష్యాతో స్నేహం చేస్తే దెబ్బతింటారు
- భారత్, చైనాకు నాటో చీఫ్ వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొనగా.. ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్‌పై యుద్ధం ఆపాలని రష్యాపై అమెరికా ఒత్తిడి తెస్తోంది. కానీ పుతిన్ మాత్రం ఏ మాత్రం వెనుకడుగు వేయడం లేదు. యుద్ధం ఆపేదిలేదని తెగేసి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రష్యాతో వాణిజ్య సంబంధాలు కలిగిన దేశాలను ఇబ్బంది పెట్టాలని ట్రంప్ భావిస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి వార్నింగ్ ఇచ్చారు. రష్యాతో సంబంధాలు కలిగిన దేశాలపై 500 శాతం సుంకాలు విధిస్తామని.. భారత్, చైనాలను హెచ్చరించారు. అంతేకాకుండా 50 రోజుల్లో రష్యా శాంతి ఒప్పందాలకు రాకపోతే భారీగా సుంకాలు విధిస్తామని రష్యాను హెచ్చరించారు. ఇలా రష్యాపై అనేక రకాలుగా ఒత్తిళ్లు పెంచుతున్నారు.
ఇది కూడా చదవండి: Ukraine: ఉక్రెయిన్ ప్రధాని రాజీనామా.. కొత్త ప్రధానిగా జెలెన్‌స్కీ స్నేహితురాలు
Also Read
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
- Ukarine War: ఉక్రెయిన్ యుద్ధంపై మోడీ, జిన్‌పింగ్ సాయం.. ట్రంప్‌కు షాకిస్తూ రష్యా కీలక ప్రకటన..
- UK Break-Up: యూకే విడిపోతుందా? స్వాతంత్య్రం కోసం స్కాట్కాంట్, వేల్స్, ఐర్లాండ్ రిఫరెండం!
తాజాగా నాటో చీఫ్ మార్క్ రుట్టే కూడా రష్యాతో వాణిజ్య సంబంధాలు కలిగిన భారత్, చైనా, బ్రెజిల్‌కు వార్నింగ్ ఇచ్చారు. రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే తీవ్రంగా నష్టపోతారని బ్రెజిల్, చైనా, భారతదేశానికి నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే బుధవారం హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: Health Warning: జిలేబీ, సమోసాపై వార్నింగ్ లేబుల్స్.. కేంద్రం క్లారిటీ
మార్క్ రుట్టే అమెరికా కాంగ్రెస్‌లో సెనేటర్లతో సమావేశం అయ్యారు. ట్రంప్‌తో కూడా భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాతే మార్క్ రుట్టే ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్, చైనా, బ్రెజిల్ దేశాలు పరిశీలన చేసుకోవాలని.. లేదంటే తీవ్రంగా దెబ్బతినాల్సి ఉంటుందని విలేకర్లతో మాట్లాడుతూ రుట్టే ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మూడు దేశాల పెద్దలు పుతిన్‌కు ఫోన్ చేసి శాంతి చర్చల గురించి ఆలోచించాలని చెప్పాలని సూచించారు. లేదంటే భారత్, చైనాపై భారీ స్థాయిలో తీవ్ర ప్రభావం పడొచ్చని చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Trump-Putin: మంచిగా మాట్లాడతాడు.. తర్వాత బాంబ్‌లు వేస్తాడు.. పుతిన్‌పై ట్రంప్ ఆగ్రహం
ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఆపేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కానీ రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం అందుకు అంగీకరించట్లేదు. దీంతో ట్రంప్‌కు కోపం వచ్చింది. ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేసి.. మాస్కోను దెబ్బకొట్టాలని ప్రణాళికలు రచిస్తున్నారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!