Operation Sindoor: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత నుంచి ఆపరేషన్ సిందూర్ వరకు ప్రతీ విషయంలోనూ పాకిస్తాన్‌కి చైనా సపోర్టు ఉందని స్పష్టంగా తెలుస్తోంది. చైనా మద్దతుతో పాటు టర్కీ కూడా భారత్‌పై దాడిలో పరోక్షంగా, ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు తెలుస్తోంది. గత వారం జరిగిన భారత్-పాకిస్తాన్ మధ్య వైమానిక పోరాటంలో చైనా పాత్ర స్పష్టంగా ఉంది. పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న భూభాగంలోకి భారత్ ఫైటర్ జెట్లు వెళ్లిన సమయంలో, పాకిస్తాన్ చైనీస్ PL-15 ఎయిర్-టు-ఎయిర్ క్షిపణులను ప్రయోగించింది.
India-China Conflict: అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కొన్నిప్రాంతాలకు చైనా పేర్లు పెట్టడంపై భారత్ తిరస్కరించింది. చైనా వ్యర్థ, విఫల ప్రయత్నాలను తాము గమనిస్తూనే ఉన్నామని భారత విదేశాంగ శాఖ వ్యాఖ్యనించింది.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు పంజాబ్ అదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించారు. అక్కడ ఉన్న ఎయిర్ ఫోర్స్ సిబ్బందిని అభినందించారు. పాకిస్తాన్‌పై ‘‘ఆపరేషన్ సిందూర్’’ సమయంలో ఈ బేస్ కీలకంగా వ్యవహరించింది. అయితే, భారత ప్రధాని ఒక్క చర్యతో పాకిస్తాన్, చైనాలు చెబుతున్నవి అబద్ధాలని రుజువు చేశారు.
Operation Sindoor: ‘‘ఆపరేషన్ సిందూర్’’తో భారత సత్తా ప్రపంచానికి తెలిసింది. భారత్ యాక్షన్‌లోకి దిగితే ఎలా ఉంటుందనే విషయం పాకిస్తాన్‌కి బాగా అర్థమైంది. ఇన్నాళ్లు తమ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని బెదిరిస్తూ వస్తున్న పాకిస్తాన్‌కి, అది పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులకు భారత్ ధీటైన సమాధానం ఇచ్చింది.
China: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది. భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’తో ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్, పీఓకే ప్రాంతాల్లోని తీవ్రవాద క్షేత్రాలపై దాడులు నిర్వహించింది. దీని తర్వాత, భారత్‌పైకి డ్రోన్లు, క్షిపణులతో పాకిస్తాన్ దాడి చేసింది.
China Support Pak: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారత్- పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో పాక్ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత, జాతీయ స్వాతంత్య్రం కోసం తమ మద్దతు కొనసాగుతుందని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ వెల్లడించారు.
పాకిస్థాన్ కాల్పుల విరమణ ఉల్లంఘన నేపథ్యంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో మాట్లాడారు. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో భారత సిబ్బందిలో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగిందని, ఉగ్రవాద నిరోధక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని దోవల్ పేర్కొన్నారు. యుద్ధం భారత్ తమ ఛాయిస్ కాదని ఆయన నొక్కి చెప్పారు.
భారతదేశం, పాకిస్థాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతకు సంబంధించి చైనా ప్రకటన వెలువడింది. పాకిస్థాన్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకోవడంలో తాము అండగా నిలుస్తామని చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌యీ అన్నారు. ఈ మేరక తాజాగా పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్‌తో చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్ యీ ఫోన్ చేశారు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణలో చైనా మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను వాంగ్‌యీకు పాక్ మంత్రి వివరించినట్లు విదేశాంగశాఖ కార్యాలయం…
China: భారత్- పాకిస్థాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి చైనా రియాక్ట్ అయింది. ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరింది. తాజా పరిస్థితులను ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్నామని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
Fact Check: పాకిస్తాన్ తప్పుడు ఫేక్ న్యూస్ ని ప్రచారం చేస్తుంది. దానికి తోడుగా చైనా కూడా చేతులు కలిపింది. పాక్ వదిలే తప్పుడు కథనాలను చైనా, అజర్బైజన్ మీడియా సంస్థలు ప్రచారంలోకి తీసుకొస్తున్నాయి.