ఈ నెల చివర్లో ప్రధాని నరేంద్ర మోడీ జపాన్, చైనా దేశాలను సందర్శిస్తారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం ఈ జపాన్ పర్యటన లక్ష్యం కాగా, చైనాలో జరిగే షాంఘై సహకార సంస్థ (SCO) సమావేశంలో ప్రధాని మోడీ పాల్గొంటారు. ఆగస్టు 30న ప్రధాని మోదీ జపాన్‌కు బయలుదేరి వెళ్తారు, అక్కడ జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిడాతో కలిసి భారత్-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంలో రెండు దేశాల మధ్య వ్యూహాత్మక, ఆర్థిక, సాంకేతిక…
Rahul Gandhi: భారత సైన్యం గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినందరకు కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసుల దాఖలైంది. అయితే, ఈ కేసును కొట్టివేయాలని రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
చైనాను భారీ వరదలు ముంచెత్తాయి. కుండపోతగా కురిసిన వర్షాలతో పలు నగరాలు అతలాకుతలం అయ్యాయి. వస్తువులు, కార్లు కొట్టుకుపోయాయి. అలాగే ఒక నగల షాపును కూడా భారీ వరద ముంచెత్తింది.
చైనీయులకు భారత ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గురువారం నుంచి టూరిస్ట్ వీసాలు ఇవ్వనున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. 2020లో సరిహద్దు ఘర్షణల తర్వాత ఇరు దేశాల మధ్య బంధాలు తెగాయి. తాజాగా విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఇటీవల చైనాలో పర్యటించారు.
Wipha Cyclone: మరో 24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ తెలిపింది. విఫా తుఫాన్ చైనా, హాంకాంగ్ ప్రాంతాల్లో బీభత్సం సృష్టించిన తర్వాత.. అది తీరం దాటి బంగాళాఖాతంలోకి ప్రవేశించడంతో.. ప్రస్తుతం ఇది తుఫానుగా మారిపోయింది.
Bitra island: భారతదేశం తన వ్యూహాత్మక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని భావిస్తోంది. హిందూ మహాసముద్రంలో భారత్ ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని అనుకుంటోంది. ఈ మేరకు ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవులను అభివృద్ధి చేయడంతో పాటు, అక్కడ త్రివిధ దళాలను మోహరిస్తోంది. ముఖ్యంగా, భారత నేవీ కోసం అనేక కొత్త ఏర్పాట్లను చేస్తోంది. ఉద్రిక్త సమయంలో చైనాకు సరకు రవాణా కట్ చేసేలా, మలక్కా జలసంధిని కంట్రోల్ చేసేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. Read Also: Honeymoon: హనీమూన్ కోసం…
Yu Zidi Qualifies for 2025 World Swimming Championships: చైనాకు చెందిన బాలిక ‘యు జిడి’ పేరు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. 12 ఏళ్ల వయసులో సింగపూర్‌లో జరిగే 2025 ప్రపంచ స్విమింగ్ ఛాంపియన్‌షిప్‌నకు అర్హత సాధించడమే ఇందుకు కారణం. సింగపూర్ ఛాంపియన్‌షిప్‌లో మూడు విభాగాల్లో యు జిడి పతక పోటీ దారుగా ఉంది. 200, 400 మీటర్ల వ్యక్తిగత మెడ్లే.. 200 మీటర్ల బటర్ ఫ్లైలో పిల్ల పిడుగు పోటీపడబోతోంది. వయసు కేవలం…
దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొనగా.. ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ చైనాలో పర్యటిస్తున్నారు. ఐదు సంవత్సరాల తర్వాత తొలిసారిగా చైనా పర్యటనకు వెళ్లిన జైశంకర్.. సోమవారం బీజింగ్‌లో చైనా ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్‌తో సమావేశం అయ్యారు.
ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక దూకుడుగా వ్యవహరిస్తున్నారు. మిత్ర దేశాలను కూడా శత్రు దేశాలుగా మార్చుకుంటున్నారు. ఆయా దేశాలపై భారీగా సుంకాలు విధించి తీవ్ర వ్యతిరేకతను మూట గట్టుకున్నారు. ఇప్పటికీ అదే ఒరవడి కొనసాగిస్తున్నారు.