Video Viral : జూలో సింహాలు బోనులో ఉంటాయి కాబట్టి అవి చూడటానికి వెళ్లినప్పుడు మనం ఎంజాయ్ చేస్తాం. అవి బోనులో ఉన్నా వాటిని చూస్తేనే మనం వణుకుతాం. అలాంటిది బోనులో నుంచి తప్పించుకుని ఒక్కసారిగా బయట ఉన్న జనాలపైకి దూసుకొస్తే గుండె ఉన్న ఫళంగా ఆగినంత పనవుతుంది.
భార్యభర్తలిద్దరూ లైవ్ లో జిమ్నాస్టిక్ చేస్తుండగా అనూహ్యా ఘటన చోటు చేసుకుంది. ఎన్నో ఏళ్లుగా కలిసి ఇలాంటి ప్రదర్శనలు ఇచ్చారు. అలాంటిది అనుకోకుండా ఘోర ప్రమాదం జరిగింది.
ప్రపంచలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ తొలిస్థానంలో నిలిచింది. దేశ జనాభాలో చైనాను ఇండియా అధిగమించింది. ఐక్యరాజ్యసమితి ఈరోజు విడుదల చేసిన గణాంకాల ప్రకారం చైనాను అధిగమించి భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించింది.
చైనా తైవాన్ మధ్య యుద్ధం వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చైనానుంచి ముప్ప పొంచి ఉన్న నేపథ్యంలో తైవాన్ కీలక నిర్ణయం తీసుకుంది. 400 యుఎస్ ల్యాండ్-లాంచ్ హార్పూన్ క్షిపణులను కొనుగోలు చేస్తుందని నిర్ణయించినట్లు సమాచారం.
ప్రజా రవాణాలో ప్రయాణిస్తున్నప్పుడు సీటును ముందుగా రిజర్వ్ చేసుకుంటాం. బస్సులు, రైళ్లల్లో ప్రయాణించినప్పుడు సీట్ల కోసం కుస్తీలు కూడా పడతారు. ఖాళీ సీట్లు లేకపోతే రద్దీగా ఉండే రైళ్లలో సుదీర్ఘ ప్రయాణం చేయడంతో చాలా అలసిపోయినట్లు అనిపిస్తుంది. అయితే, రైలులో సీటు దొరక్కపోవడంతో విసిగిపోయిన ఓ వ్యక్తి తనతో పాటు సోఫాను తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు.
Pakistan: పాకిస్తాన్ ఆల్ వెదర్ ఫ్రెండ్ చైనా నెమ్మదిగా ఆ దేశంలో తమ వ్యాపారాలను మూసేస్తోంది. పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం, రాజకీయ అనిశ్చితి, ఉగ్రవాదం వంటి అంశాలు ఇందుకు దోహదం చేస్తున్నాయి. ఇటీవల కాలంలో చైనా-పాక్ ఎకనామిక్ కారిడార్(సీపెక్)లో భాగంగా జరుగుతున్న అభివృద్ధి పనులపై తరుచుగా బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్, పాక్ తాలిబాన్లు దాడులకు తెగబడుతున్నారు. ఈ ప్రాజెక్టుల్లో పనిచేసే చైనీయులు భయంతో పనులు చేస్తున్నారు. చివరకు చైనా తమ పౌరులు సొంత సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాలని…
చైనాలోనే.. చాంకింగ్ లోని లిన్షి టౌన్ షిప్ లో సాంప్రదాయ చైనీస్, పాశ్చాత్య శైలి కలయికతో భనాలను నిర్మించినట్లు ఫోటో గ్రాఫర్ గువోజు తెలిపారు. ఇది పర్యాటకలకు అంతరిక్షం గుండా ప్రయాణిస్తున్న అనుభూతి ఇస్తుందని చెప్పారు.
Pakistan: పాకిస్తాన్ తో పాటు ఇతర ఇస్లామిక్ దేశాల్లో ‘‘దైవదూషణ’’కు తీవ్రమైన శిక్షలు ఉంటాయి. మరణశిక్షలు విధించిన సందర్భాలు ఎక్కువ. పాకిస్తాన్ వంటి దేశాల్లో అయితే ఎలాంటి అనుమానం ఉన్నా కూడా దైవదూషణ వంటి కేసుల్లో మతోన్మాదులే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారు. ఇలాంటి ఘటనలు ఇటీవల కాలంలో జరిగాయి. 2021లో ఓ శ్రీలంక జాతీయుడిని దైవదూషణ పేరుతో ప్రజలే నిప్పంటించి కాల్చి చంపారు. దీని తర్వాత ఓ వ్యక్తిపై దాడి చేసేందుకు ఏకంగా పోలీస్ స్టేషన్…
ఉక్రెయిన్ యుద్ధంలో ఏ దేశానికి ఆయుధాలు విక్రయించబోమని చైనా ప్రతిజ్ఞ చేసింది. యుద్ధంలో తలమునకలైన రష్యా, ఉక్రెయిన్లలో ఎవరికీ ఆయుధాలు విక్రయించబోమని ప్రకటించింది. బీజింగ్ రష్యాకు సైనిక సహాయం అందించగలదనే పాశ్చాత్య ఆందోళనలకు ప్రతిస్పందిస్తూ చైనా విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్ శుక్రవారం చెప్పారు.
చైనా-శ్రీలంక నుంచి లక్ష కోతుల్ని దిగుమతి చేసుకోవటానికి ప్రతిపాదన పెట్టింది. ఇంత భారీ సంఖ్యలో కోతుల్ని దిగుమతి చేసుకోవాలని చైనా అనుకోవటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.