China: మద్యపానం అతిగా తాగితే హానికరం. గతంలో తెలుగు రాష్ట్రాల్లో మద్యపానంపై ఛాలెంజ్ చేసి మితిమీరిన మద్యం తాగిన వ్యక్తులు మరణించిన సంఘటనలు జరిగాయి. తాజాగా చైనాలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఇలాగే అతిగా తాగి మరణించాడు. లైవ్ స్ట్రీమింగ్ సమయంలో 7 బాటిళ్ల వోడ్కాను తాగాడు, చివరకు 12 గంటల్లోనే మరణించాడు. జైబియు అని పిలువడబే చైనీస్ వోడ్కాను తాగినట్లు సీఎన్ఎన్ నివేదించింది.
Read Also: Arikomban: మళ్లీ ప్రజలపై దాడులు మొదలుపెట్టిన పోకిరి ఏనుగు “అరికొంబన్”
సాన్కియాంగ్ అనే 34 ఏళ్ల యువకుడు చైనా టిక్ టాక్ వెర్షన్ డౌయిన్ లో లైవ్ లో ఉంటూ 7 బాటిళ్ల చైనీస్ వోడ్కాను తాగాడు. దీంట్లో 30 నుంచి 60 శాతం దాకా ఆల్కాహాల్ కంటెంట్ ఉంటుంది. పీకే ఛాలెంజ్ లో పలు రకాల టాస్క్ లలో ఒకరిపై ఒకరు పోటీ పడుతుంటారు. ఇలాంటి సమయంలోనే సాన్కియాంగ్ వోడ్కాను తాగాడు. జావో అనే వీక్షకుడు మాట్లాడుతూ.. తాను చూసినప్పుడు మూడు బాటిళ్ల వోడ్కా తాగడమైపోయిందని, నాలుగోది తాగడం తాను చూశానని తెలిపాడు.
లైవ్ ప్రారంభం అయిన 12 గంటల తర్వాత అతను మరణించాడని చైనీస్ మీడియా వెల్లడించింది. అతని కుటుంబ సభ్యులు చూసే సమయానికే అతను ప్రాణం కోల్పోయినట్లు తెలిపింది. మితిమీరిన మద్యపానం వల్లే చనిపోయినట్లు అక్కడి అధికారులు ధ్రువీకరించారు. సాధారణంగా డౌయిన్ మద్యపానాన్ని అనుమతించడు. ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి మద్యం సేవించినందుకు గతంలో యాప్ నుంచి నిషేధించబడ్డాడు. అయితే.. కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకుని మరోసారి మద్యంతాగి ప్రాణాలు కోల్పోయాడు.