G20 Meeting: జమ్మూ కాశ్మీర్ విషయంలో దాయాది దేశం పాకిస్తాన్ కు వంత పాడుతోంది చైనా. మరోసారి భారతదేశంపై తన అక్కసును వెళ్లగక్కింది. పర్యాటక రంగంపై జీ 20 వర్కింగ్ గ్రూప్ మూడో సదస్సు జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో నిర్వహించాడాన్ని చైనా వ్యతిరేకిస్తోంది. శ్రీనగర్ లో ఈ నెల 22 నుంచి 24 వరకు మూడు రోజలు పాటు సభ్యదేశాలతో సమావేశం జరుగనుంది. దీనికి ఇప్పటికే భారత ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది. అంతర్జాతీయ సమావేశం కావడంతో జమ్మూ కాశ్మీర అంతటా భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది భారత్. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్ఎస్‌జీ, సీఆర్పీఎప్, మెరైన్ కమాండోలు, సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. శ్రీనగర్ దాల్ సరస్సులో మెరైన్ కమాండోలు గస్తీ కాస్తున్నారు.
ఇదిలటా ఉంటే శ్రీనగర్ లోని ‘‘షేర్ ఏ కాశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్’’లో జరగబోతోంది. దీనిపై డ్రాగన్ కంట్రీ చైనా అభ్యంతరం తెలిపింది. వివాదాస్పద భూభాగంలో ఇటువంటి భేటీలు జరపడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ బెన్ బిన్ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలకు భారత్ ఘాటుగానే స్పందించింది. భారత్ తన సొంత భూభాగంలో ఎక్కడైనా స్వేచ్ఛగా సమావేశాలు నిర్వహిస్తుందని, చైనాతో సంబంధాలు సాధారణ స్థితికి చేరుకోవడానికి సరిహద్దు వెంబడి శాంతి, సుస్థిరత అవసరం అని మన దేశం స్పష్టం చేసింది.
Read Also: Minister KTR: వాషింగ్టన్ డీసీలో WTITC స్కై సోరర్ లాంచ్ చేసిన మంత్రి కేటీఆర్
ఇదిలా ఉంటే ఈ సమావేశానికి తన మిత్రదేశాలు రాకుండా, సమావేశం భగ్నం అయ్యేందుకు పాకిస్తాన్ అన్ని మార్గాలు వెతుకుతోంది. మిత్ర దేశాలు ఈ సమావేశానికి వెళ్లకుండా పెద్ద ఎత్తున లాబీయింగ్ చేపడుతోంది. ఇప్పటికే పాక్ అత్యంత మిత్రదేశాలు అయిన టర్కీ, సౌదీ అరేబియా, చైనాలపై ఒత్తిడి తీసుకువస్తోంది. చైనా ఈ సమావేశానికి హాజరుకాబోమని చెబుతున్న నేపథ్యంలో సౌదీ, టర్కీ ఈ సమావేశాని హాజరుకావడం సందేహంగా మారింది.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ లో జరుగుతున్న అంతర్జాతీయ సదస్సు ఇదే. జీ 20 సమావేశం కోసం 60 మందికి పైగా విదేశీ ప్రతినిధులు హాజరయ్యారు. విదేశీ ప్రముఖులు కాశ్మీర్ అందాలను తిలకించేలా ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. విస్తృతంగా భద్రతా ఏర్పాట్లను చేశారు. శ్రీనగర్ మొత్తాన్ని ‘నో డ్రోన్’జోన్ గా అధికారులు ప్రకటించారు. అనుమానాస్పద అంతర్జాతీయ కాల్స్, వదంతుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.