Warming World: భూమి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ గ్యాసెస్ ఎక్కువ కావడంతో గత కొన్ని దశాబ్ధాలుగా భూగోళం ఉష్ణోగ్రతల్లో మార్పు వస్తోంది. కర్భన ఉద్గారాల విడుదల కూడా ఇందుకు ఓ కారణం అవుతోంది. వేడిగా ఉండే దేశాలు మరింత వేడిగా మారుతున్నాయి. సమశీతోష్ణ దేశాలు ఊహించని విధంగా ఉష్ణోగ్రతలను ఎదుర్కొంటున్నాయి. ధృవాల వద్ద మంచు వేగంగా కరిగిపోతుంది. ఇదే జరిగితే కొన్నేళ్లలో సముద్రతీర ప్రాంతాల్లో ఉండే నగరాలు కనుమరుగు అవుతాయి.
ఉష్ణోగ్రతల నుంచి తప్పించుకునేందు ప్రజలు ఏసీలను విరివిగా వాడుతున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో 1.2 బిలియన్ల గ్రామీణ, పట్టణ పేదలు ప్రమాదంలో ఉన్నారు. వీరికి ఏసీల వంటివి అందుబాటులో లేవు. సస్టైనబుల్ ఎనర్జీ ఫర్ ఆల్ 2022 నివేదిక ప్రకారం..2.4 బిలియన్ల మధ్యతరగతి ప్రజలు అమకు అందుబాటులో చవకైన కూలింగ్ పరికరాలను కొనుగోలు చేస్తున్నారు. అయితే వేడి నుంచి తప్పించుకోవడానికి ఏసీలను వాడుతున్నారు, కానీ ఇది రాబోయే కాలంలో విద్యుత్ సరఫరాపై విపరీతమైన ఒత్తిడిని కలిగిస్తోందని నివేదిక పేర్కొంది.
Read Also: Gujarat: దారుణం.. గర్ల్‌ఫ్రెండ్‌పైనే అత్యాచారం.. పైశాచిక ప్రవర్తన
రాబోయే మూడు దశాబ్దాల్లో ప్రపంచవిద్యుత్ డిమాండ్ లో ఈ కూలింగ్ పరికరాలు ఎక్కువగా ఉంటాయని ఇంటర్నేషన్ ఎనర్జీ ఏజెన్సీ 2018లో ఓ నివేదికలో తేలిపింది. ఇప్పటి నుంచి 2050 మధ్య ప్రతీ సెకన్ కు దాదాపుగా 10 ఏసీలు విక్రయించబడతాయని ఆ సంస్థ అంచనా వేసింది. ఫ్యాన్లు, డీహ్యూమిడిఫైయర్లు, ఎసీలు ప్రతీ ఏడాది 2 వేల టెరావాట్ల కంటే ఎక్కువ విద్యుత్ ను ఉపయోగించుకుంటాయి. ఇది ఆఫ్రికా అంతటా ఉపయోగించే మొత్తం విద్యుత్ కన్నా 2 రెట్లు అధికం. ప్రపంచం మొత్తం విద్యుత్ లో ఇది 10 శాతం.
యూఎస్, మిడిల్ ఈస్ట్ లలో ఎలక్ట్రిసిటీ డిమాండ్ పెరిగింది. ఉదాహరణకు సౌదీ అరేబియాలో ఏడాది కరెంట్ బిల్లుల్లో 70 శాతం ఏసీలదే ఉంటుంది. ఇక ఇండియా, చైనా, ఇండోనేషియాల్లో కరెంట్ డిమాండ్ పెరుగుతోంది. 2050 నాటికి ఈ శీతలీకరణ యంత్రాల వినియోగం గణనీయంగా పెరుగుతుందని, 2500 గిగావాట్స్ ఎలక్ట్రిసిటీ అదనంగా అవసరం అవుతుందని నివేదిక తెలిపింది. ఇది అమెరికా, యూరప్, ఇండియాల ఎనర్జీ ఉత్పత్తితో సమానం అని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ వెల్లడించింది. సెంటర్ ఫర్ సస్టైనబుల్ కూలింగ్ అంచనా ప్రకారం 2050 నాటికి ప్రపంచానికి 14 బిలియన్ల అదనపు శీతలీకరణ పరికరాలు అవసరమవుతాయి, ఇది ప్రస్తుతం వాడుకలో ఉన్న 3.6 బిలియన్ల కంటే దాదాపు నాలుగు రెట్లు.