Tiananmen Square: స్వేచ్ఛ కోసం నినదించిన ప్రజలను అత్యంత దారుణంగా అణిచివేసి, వేల మందిని నిర్ధాక్షిణ్యంగా చంపేసిన తియాన్మెన్ స్వేర్ ఊచకోతకు 34 ఏళ్లు నిండాయి. తమకు ఎదురుతిరిగితే ఏ రకంగా ప్రవర్తిస్తుందనే ఉదంతాన్ని తియాన్మెన్ స్వేర్ రూపంలో చైనా చూపించింది. ఎలాంటి కనికరం లేకుండా సైన్యంతో కాల్పులు జరిపింది, యుద్ధ ట్యాంకులతో ప్రజలను అణిచివేసింది.
జూన్ 4 సంఘటనగా పిలుచుకునే ఈ తియాన్మెన్ స్వేర్ ఘటన 1989 జూన్ 4న జరిగింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రజలను పిట్టల్లా కాల్చి పడేసింది కమ్యూనిస్ట్ చైనా ప్రభుత్వం. రాజధాని బీజింగ్ నగరంలో ప్రజాస్వామ్యం కోసం ప్రజలు పెద్ద ఎత్తున నిరసన చేపడుతున్న ప్రజల్ని అక్కడి ప్రభుత్వం చంపేసింది.
ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పేరొందిన చైనా, ఈ స్థాయికి రావడానికి అనేక దుర్మార్గాలకు తెగబడింది. చైనాలో అవినీతిపై పోరాడి, సంస్కరణకు పిలుపునిచ్చిన నేతగా గుర్తింపు పొందిన కమ్యూనిస్ట్ పార్టీ నేత హు యెబాంగ్ 1989 ఏప్రిల్ 15 చనిపోయారు. ఆయనకు నివాళి అర్పించేందుకు దేశవ్యాప్తంగా తియాన్మెర్ స్వేర్ వద్దకు వేల సంఖ్యలో విద్యార్థులు చేరుకున్నారు. ఇది నెమ్మదిగా నిరసనగా మారింది. ఇది దేశవ్యాప్తంగా విస్తరించింది. విద్యార్థి లోకానికి తోడుగా ప్రజలు కూడా చేతులు కలిపారు.
Read Also: Rahul Gandhi: ఇది గాంధీ-గాడ్సేల మధ్య పోరాటం.. మోడీ వెనక చూసి కార్ నడుపుతున్నాడు..
ఈ నిరసనలను అణిచివేయడానికి అక్కడి ప్రభుత్వం రాజకీయ కుట్ర అనే ఆరోపణలు గుప్పించింది. ఈ నిరసనలు ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఇదిలా ఉంటే అధ్యక్షుడు డెన్ జియావోపింగ్ శాంతియుతంగా ఈ సమస్యను పరిష్కరించాలని చూశాడు. రష్యాకు చెందిన నేత నికెల్ గోర్భచెవ్ మే 15 బీజింగ్ పర్యటన ఉండటంతో ఈ నిరసనకారులను తియాన్మెన్ స్వేర్ నుంచి ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించాలని చూశారు. అయితే ఇది సాధ్యపడలేదు ఫలితంగా గోర్భచెవ్ పర్యటన విఫలం అయింది.
మరోవైపు తియాన్మెర్ స్వేర్ వద్దకు నిరసన తెలిపేందుకు రోజురోజుకు లక్షల మంది చేరుకుంటున్నారు. అయితే వీరిని అణిచివేసేందుకు పీపుల్ లిబరేషన్ ఆర్మీ జూన్ 2న ఈ నిరసనల్ని అణిచివేయాలనే ప్రభుత్వ ఆదేశాలతో జూన్ 3 అర్థరాత్రి తియాన్మెన్ స్వేర్ వద్దకు చేరుకుంది. జూన్ 4న తెల్లవారజామున సైనికులు అడ్డుగా ఉన్న బారికేడ్లను ట్యాంకులతో తొక్కించి, నిర్థాక్షిణ్యంగా కాల్పులు జరిపింది. బీజింగ్ తోపాటు ఇతర ప్రాంతాల్లో జరుగుతన్న నిరసనల్ని అణిచివేసింది. ఏకంగా 10,000 మంది చనిపోయినట్లు అంచనా. అయితే చైనా అధికారికంగా 200 మంది వరకు మాత్రమే చనిపోయారని తెలిపింది.