China: వీసా గడువు పొడిగించకపోవడంతో ..చైనాను వీడనున్న ఆఖరి భారత జర్నలిస్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China: చైనాలో ఉన్న భారతీయ జర్నలిస్టుకు ఆ దేశం వీసా గడువును పొడిగించకపోవడంతో ఈ నెలాఖరు నాటికి చైనా నుంచి భారతీయ జర్నలిస్టులందరూ ఇండియాకు తిరిగి వచ్చేసినట్టు అవుతుంది. ఈ నెలాఖరుతో సదరు జర్నలిస్టు వీసా గడువు ముగియనుంది.. అయితే చైనాలో వీసాపై నిషేధాజ్ఞలు విధించి.. వీసా గడువును పొడిగించకపోవడంతో ఇక చైనాలో భారతీయ జర్నలిస్టులు లేకుండా పోనున్నారు.
Read also: Sriya Reddy: పవన్ ఓజీలో విశాల్ రెడ్డి వదిన.. పవర్ ఫుల్ అంటూ ట్వీట్
Also Read
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
- Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్లింక్పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
2020 మధ్యలో చైనా-భారత్ సరిహద్దులో సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 24 మంది మృతి చెందడంతో రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించినప్పటి నుండి దేశాల మధ్య ఉద్రిక్తత కొనసాగుతోంది. భారత్‌లో తమ రిపోర్టర్‌లకు అన్యాయం జరిగిందని పేర్కొంటూ చైనాలో ఉన్న భారతీయ జర్నలిస్టును దేశం విడిచి వెళ్లాలని చైనా పేర్కొంది. చైనాకు చెందిన జర్నలిస్టులు భారత్‌లో అన్యాయానికి, వివక్షకు గురవుతున్నారని ఆ దేశ విదేశాంగ అధికార ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ సోమవారం ఆరోపించారు. 2020లో మొత్తం 14 మంది చైనా జర్నలిస్టులు భారత్‌లో ఉండగా, అక్కడి పరిస్థితుల కారణంగా ప్రస్తుతం ఒక్కరే మిగిలారని ఆయన పేర్కొన్నారు. అయితే చైనా ఆరోపణలపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. గతనెలలో భారత్‌లో జరిగిన ఎస్‌సీవో విదేశాంగ మంత్రుల సమావేశానికి చైనా జర్నలిస్టులకు అనుమతులు ఇచ్చామని భారత్ స్పష్టం చేసింది. ఇండియాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చైనా జర్నలిస్టులు పని చేస్తున్నారని … కానీ చైనాలో అలాంటి పరిస్థితులు లేవని పేర్కొంది.
Read also: Bhatti Vikramarka: నాగార్జునసాగర్ లో గెలిచేది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి
ప్రస్తుతం చైనాలో కొనసాగుతున్న పీటీఐకి చెందిన జర్నలిస్టు వీసా గడువును పొడిగించేందుకు చైనా ప్రభుత్వం నిరాకరించింది. దీంతో ఈనెల చివరి నాటికి ఆ జర్నలిస్టు తిరిగి రానున్నారు. 2023 ప్రారంభంలో నలుగురు భారతీయ జర్నలిస్టులు చైనాలో ఉండగా.. వీసాపై నిషేధాజ్ఞలు విధించడంతో ఇద్దరు స్వదేశానికి చేరుకున్నారు. వీసా గడువు ముగియడంతో జూన్ 11న మరొకరు జర్నలిస్టు కూడా ఇండియాకి వచ్చేశారు. తాజాగా ఆఖరి జర్నలిస్టు వీసా ఈ నెలాఖరు వరకు ఉండటంతో.. వీసా గడువును చైనా పొడిగించకపోవడంతో అతను కూడా భారత్‌కు రానున్నారు. అయితే భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ నెలలో భారతీయ జర్నలిస్టులను చైనాలో పని చేయడానికి చైనా అనుమతిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపింది. విదేశీ జర్నలిస్టులందరికీ అక్కడ కార్యకలాపాలు నిర్వహించడానికి భారతదేశం అనుమతించిందని తెలిపింది.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!