గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం నుంచి సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు 27శాతం పెరిగాయి. ప్రధానంగా అమెరికా, చైనా, యూరోపియన్ దేశాలకు అధిక మొత్తంలో ఎక్స్ పోర్ట్స్ అయ్యాయని సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు, అభివృద్ధి సంస్థ ఛైర్మన్ డీవీ స్వామి వెల్లడించారు. 2021-22 ఏడాదిలో భారత్ నుంచి రూ.57,486 కోట్ల విలువైన 13.69 లక్షల టన్నుల సముద్ర ఉత్పత్తుల్ని వివిధ దేశాలకు ఎగుమతి చేయగా.. 2022-23 సంవత్సరంలో రూ.63,969 కోట్ల (8.09 బిలియన్ల అమెరికా డాలర్లు) విలువైన 17.35 లక్షల టన్నులు రవాణా చేసినట్లు పేర్కొన్నారు. పరిమాణంలో 26.73శాతం, రూపాయి విలువ పరంగా 11.08శాతం మేర వృద్ధి సాధించినట్లు వెల్లడించారు.
Also Read : Trivikram: ఆ స్టార్ హీరోలతో త్రివిక్రమ్ మూడో సినిమా చిత్రం భళారే విచిత్రం
పరిమాణం, విలువపరంగా రొయ్యల ఉత్పత్తులు తొలి స్థానంలో నిలిచాయి. మొత్తం ఎగుమతులలో 40.98శాతం, డాలర్ విలువలో 67.72శాతం వాటా రొయ్యలదే. రూపాయి విలువలో చూస్తే 1.01శాతం పెరిగింది. రూ.43,135 కోట్ల విలువైన 7.11 లక్షల టన్నులు ఎగుమతులు చేసినట్లు పేర్కొన్నారు. ఇందులో 2.76 లక్షల టన్నుల్ని అమెరికా, 1.46 లక్షల టన్నుల్ని చైనా, 95,377 టన్నుల్ని యూరోపియన్ యూనియన్, 65,466 టన్నుల్ని సౌత్ ఈస్ట్ ఆసియా దేశాలు దిగుమతులను చేసుకున్నాయి.
Also Read : Nottingham: నాటింగ్‌హమ్ దాడిలో భారత సంతతి యువతి మృతి
బ్లాక్‌టైగర్ రొయ్యల ఎగుమతిలో 74.06శాతం వృద్ధి సాధించింది. రూ.2,564.71 కోట్ల విలువైన 31,213 టన్నుల రొయ్యల ఎగుమతులు జరిగాయి. ఈ రకం రొయ్యలకు జపాన్ ప్రధాన మార్కెట్‌గా నిలిచింది. విదేశీ మార్కెట్ల విలువ పరంగా 2,632 మిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను దిగుమతి చేసుకున్న అమెరికా తొలి స్థానంలో నిలవగా.. డిమాండు మందగించడంతో అమెరికాకు ఎగుమతులు డాలర్ పరంగా 21.94శాతం మేర తగ్గాయి. అగ్ర రాజ్యానికి ఎగుమతి అయిన వాటిలో ప్రధాన ఉత్పత్తి రొయ్యలు. 1,508 మిలియన్ డాలర్ల విలువైన 4.05 లక్షల టన్నుల మేర దిగుమతి చేసుకొని చైనా సెకండ్ ప్లేస్ లో ఉంది.