ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్ల వశం అయిపోయింది.. ఎవరూ ఊహించని రేతిలో వేగంగా కాబూల్‌ను హస్తగతం చేసుకున్నారు తాలిబన్లు.. అయితే, ఇప్పుడు మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఆఫ్ఘన్‌తో స్నేహనికి సిద్ధం అంటోంది డ్రాగన్ కంట్రీ.. ఆఫ్ఘనిస్థాన్‌లో జరుగుతున్న తాజా పరిణామాలపై స్పందించిన చైనా.. ఆ దేశాన్ని హస్తగతం చేసుకున్న తాలిబన్ ఫైటర్లతో స్నేహ సంబంధాలు కొనసాగించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది.. ఇక, ఆఫ్ఘన్ పొరుగు దేశమైన రష్యా మాత్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఆ దేశంలో…
డ్రాగన్ దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కరోనాకు పుట్టినిల్లైన చైనాలో కేసులు పెరుగుతుండటంతో ఆ దేశంలో ఆందోళనలు మొదలయ్యాయి. 2019లో వూహన్ నగరంలో తొలి కరోనా కేసు నమోదైంది. కరోనా మహమ్మారి సమయంలో వూహన్‌లో అప్పట్లో కఠినమైన నిబంధనలు అమలుచేశారు. కరోనా సోకిన వారికి ఇళ్లలో ఉంచి బయట తాళాలు వేశారు. ఐరన్ బార్స్‌తో తలుపులు తెరుచుకోకుండా చేశారు. కరోనా నుంచి కొలుకునే వరకు ఇంటి నుంచి ఎవర్నీ బయటకు రానివ్వలేదు. ఇప్పుడు డెల్టావేరియంట్ ఆ…
చైనా హ్యాకర్లు సైబర్ దాడులకు పాల్పడ్డారు.. ఇజ్రాయెల్‌పై గురిపెట్టిన చైనా హ్యాకర్లు.. ఆ దేశానికి చెందిన వివిధ ప్రభుత్వ సంస్థలు, ఐటీ, టెలికాం కంపెనీలను సంబంధించిన డాటాను చోరీ చేశారు.. ఈ విషయాన్ని అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన సైబర్ సెక్యూరిటీ కంపెనీ ‘ఫస్ట్ ఐ’ వెల్లడించింది. పలు కంపెనీల ఫైనాన్స్, టెక్నాలజీ, వ్యాపారానికి సంబంధించిన డాటాను హ్యాకర్లు దొంగిలించారని పేర్కొంది.. ఆ డాటాలో యూజర్ డాటా కూడా ఉన్నట్టుగా భావిస్తున్నారు… ఫస్ట్ ఐ పేర్కొన్న ప్రకారం.. డ్రాగన్…
కరోనా తరువాత అన్ని రంగాలు తిరిగి తెరుచుకుంటున్నాయి. కరోనాకు కారణమైన చైనాలో పరిస్థితులు సాధారణ స్థితికి రావడంతో అన్ని రంగాలు తెరుచుకున్నాయి. పర్యాటక రంగం తిరిగి ప్రారంభమైంది. రాజధాని బీజింగ్‌లోని జూ వీకెండ్స్‌లో పర్యాటకులతో కిటకిటలాడుతున్నాయి. ఆదివారం రోజున పెద్దసంఖ్యలో పర్యాటకులు బీజింగ్ జూకు తరలి వచ్చారు. అయితే, జూలో ఉన్నట్టుండి ఇద్దరు పర్యాటకుల మధ్య గొడవ ప్రారంభమైంది. ఆ గొడవ చిలికి చిలికి గాలివానలా మారి రెండు కుటుంబాల మధ్య గొడవలా మారిపోయింది. రెండు కుటుంబాలకు…
చైనాలో మళ్లీ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయింది. మధ్యస్త, తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల నుంచి రాజధాని బీజింగ్‌కు వచ్చే వారిపై నిషేదం విధించింది. కరోనా తీవ్రత ఉన్న ప్రాంతాల నుంచి వచ్చే రైలు, రోడ్డు, విమాన మార్గాలపై కూడా నిషేదం విధించింది చైనా ప్రభుత్వం. ఎవరైనా సొంత వాహనాల్లో ఆయా ప్రాంతాల నుంచి రావాలనుకున్నా వారిని మధ్యలోనే నిలువరించేందుకు ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేసింది. మధ్యస్త, తీవ్రత…
కరోనా పుట్టినిల్లు చైనా ఇప్పుడు వణికిపోతోంది… రోజుకో కొత్త వేరియంట్ తరహాలో ప్రపంచాన్ని ఓ కుదుపు కుదేపిసింది కరోనా వైరస్.. ఇప్పుడు.. డెల్టా వేరియంట్ డ్రాగన్ కంట్రీ కంటిమీద కునుకులేకుండా చేస్తోంది… చైనా వ్యాప్తంగా కొత్తగా 500 డెల్టా వేరియంట్ కేసులు వెలుగుచూశాయి.. అవి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నమోదు అయ్యాయి… దీంతో, అప్రమత్తం అయిన ప్రభుత్వం.. కేసుల ప్రభావం ఎక్కువగా ఉన్న 144 ప్రాంతాల్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ట్యాక్సీ సేవలను రద్దు చేసింది.. మరోవైపు.. బీజింగ్‌లోనూ…
చైనాలోని 17 ప్రావిన్స్‌లో కరోనా కేసుల పెరుగుతున్నాయి. సంవత్సరం తరువాత వూహాన్లో కొత్త కేసులు వెలుగు చూడటంతో ఆ నగరంలో తిరిగి కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు. కోటి మంది జనాభా ఉన్న వూహన్ నగరంలో అందరికీ టెస్టులు నిర్వహించి పాజిటివ్ ఉన్న వారిని ఐసోలేషన్‌లో ఉంచాలని చూస్తున్నారు. అయితే, ఇప్పుడు ఒక్క వూహాన్ నగరంలోనే కాకుండా ఆ దేశంలోని 17 ప్రావిన్స్‌లలో కేసులు పెరుగుతున్నాయి. చైనాలో ప్రాముఖ్యత కలిగిన నగరాలు, పర్యాటక పరంగా ప్రాముఖ్యత కలిగిన నగరాల్లో…
కరోనా పుట్టినిల్లు అయిన వుహాన్‌లో మళ్లీ వైరస్ కలకలం రేపుతోంది. దాదాపు ఏడాది తర్వాత వుహాన్‌లో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. గత 24 గంటల్లో చైనాలో 84 కేసులు నమోదు కాగా.. అందులో ఎనిమిది మంది వుహాన్ వాళ్లే ఉన్నారు. వుహాన్‌లో బయటపడ్డ కేసుల్లో ముగ్గురిలో కరోనా లక్షణాలు ఉండగా.. ఐదుగురు అసింప్టమాటిక్ అని తేలింది. వీరందరినీ ఐసోలేషన్‌లో ఉంచడంతో పాటు వారి కాంటాక్ట్స్‌ను గుర్తిస్తున్నారు. అంతేకాకుండా వుహాన్‌లోని దాదాపు కోటి మంది జనాభాకు పరీక్షలు చేయాలని…
2019 డిసెంబర్లో వూహాన్లో కరోనా మొదటి కరోనా కేసు వెలుగుచూసింది. అక్కడి నుంచి కరోనా వైరస్ ప్రపంచం మొత్తం వ్యాపించింది. అయితే, కరోనా కట్టడి విషయంలో చైనా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని రవాణా వ్యవస్థను స్తంభింపజేసింది. ప్రజలను ఇంటికే పరిమితం చేసింది. ఆ తరువాత ఆ నగరం మెల్లిగా కరోనా నుంచి కోలుకుంది. అయితే, సంవత్సరం తరువాత మళ్లీ వూహన్ కరోనా కేసు నమోదైంది. దీంతో ఆ నగరంలో కరోనా కలకలం రేగింది. సంవత్సరం తరవాత…