దేశం ఏదైనా కావొచ్చు… వేడుకల్లో బంగారం తప్పనిసరి. వారి సంప్రదాయాల ప్రకారం బంగారాన్ని ఆభరణాలుగా మలచుకొని ధరిస్తుంటారు. పొరుగుదేశం చైనాలో బంగారం వినియోగం ఎక్కువగా ఉంటుంది. పండుగలు, వేడుకలు, పెళ్లిళ్లకు పెద్దమొత్తంలో బంగారం వినియోగిస్తుంటారు. అయితే, ఇటీవలే హుబే ప్రావిన్స్‌కు చెందిన ఓ వధువుకు వివాహం జరిగింది. పెళ్లికూతురికి మంటపంలో వరుడు ఏకంగా 60 కిలోల బంగారాన్ని బహుకరించాడు. 60 కిలోల బరువైన ఆభరణాలకు వధువు ధరించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దేశంలో 10 గ్రాముల బంగారం 40 వేలకు పైగా ఉన్నది. అంటే కేజీ బంగారం 40 లక్షలకు పైగా ఉంటుంది. 60 కేజీలు అంటే… ఎంత ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు.
Read: ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు…