తూర్పు లద్దాఖ్‌లో నెలకొన్న ఉద్రిక్తతలు,బోర్డర్ లో ఉన్నసమస్యలు తగ్గించేందుకు ఇండియా చైనా దేశాల మధ్య కోర్ కమాండర్ స్థాయి చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆదివారం రోజున 13 వ కోర్ కమాండర్ స్థాయి చర్చలు జరిగాయి. అయితే, ఈ చర్చలు ఎలాంటి ఫలితాలు ఇవ్వలేదు. భారత్ చేసిన సూచనలను చైనా అంగీకరించలేదని, ఎటువంటి ప్రతిపాదనలు చేయలేదని ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. ఈ చర్చలు ముగిసిన తరువాత చైనా మరోసారి భారత్ అనుసరిస్తున్న విధానలను, వ్యూహాలపై డ్రాగన్ అధికారిక మీడియా మండిపడింది. భారత్ ఇష్టానుసారంగా సరిహద్దులను నిర్ణయిస్తోందని మండిపడింది. సరిహద్దు విషయంలో భారత్ చేస్తున్నవి అసత్య, అవాస్తవిక డిమాండ్లు అని, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు చైనా తలొగ్గదని, భారత్ శక్తికి మించి ఊహించుకుంటోందని, ఒకవేళ భారత్ యుద్ధానికి దిగితే ఆ దేశమే నష్టపోతుందని చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ ప్రకటించింది.
Read: అక్కడ లీటర్ పాలు వెయ్యి రూపాయలు… భయపెడుతున్న గ్యాస్ సిలిండర్…