ప్రముఖ సాప్ట్‌వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్ ఆధ్వర్యంలోని లింక్డిన్ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇప్పటి వరకు చైనాలో తన కార్యకలాపాలు సాగిస్తున్న లింక్డిన్‌ను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. చైనా ప్రభుత్వం టెక్ సంస్థలపై ఆంక్షలను విధిస్తున్నది. ఈ నేపథ్యంలో లింక్డిన్ చైనాలో కార్యకలాపాలు సాగించడం కష్టంగా మారింది. దీంతో సేవల్ని నిలిపివేయాలని నిర్ణయించింది. అయితే, ఉద్యోగాల కోసం ధరఖాస్తు చేసుకునేందుకు ప్రత్యేకంగా ఓ యాప్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించారు. లింక్డిన్‌లోని సమాచారాన్ని నియంత్రించేందుకు ప్రయత్నించగా మైక్రోసాఫ్ట్ సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
Read: జేఈఈ ఫలితాలు విడుదల: రేపటి నుంచి రిజిస్ట్రేషన్స్…