శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎంతో పురోభివృద్ధి సాధించినప్పటికీ సమాజంలో బాల్య వివాహాలు, వరకట్న వేధింపులు మాత్రం పట్టి పీడిస్తూనే ఉన్నాయి. ఆర్థిక పరిస్థితుల కారణంగా పిల్లలను పోషించే శక్తిలేక బాల్యంలోనే పెళ్లిళ్లు చేయడానికి సిద్ధపడుతున్నారు కొందరు తల్లిదండ్రులు. ఆస్తులను ఆశగా చూపి తమ కంటే 20 ఏళ్లు తక్కువ వయసున్న బాలికలను పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతున్నారు కొందరు వ్యక్తులు. ఇలాంటి ఘటనే రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. షాద్ నగర్ నందిగామలో బాల్య వివాహం చేసుకున్న వ్యక్తిపై…
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం అని ప్రభుత్వాలు అవగాహన కల్పిస్తున్నప్పటికీ కొందరు మాత్రం మారడం లేదు. ఇంట్లో ఉన్న తాతయ్యలు, నానమ్మ, అమ్మమ్మలు తమ మనుమరాలు, మనువడి పెళ్లి చూసి చనిపోవాలి అని తమ కోరికలను వెలిబుచ్చుతుంటారు. వాళ్ల కోరికలను కాదనలేక పిల్లలకు పెళ్లి చేసేందుకు రెడీ అవుతుంటారు. ఇదే తరహాలో హర్యానాలో ఓ నానమ్మ మునిమనవడిని చూడాలనే కోరకతో తన మనుమరాలికి పెళ్లి చేయాలని చూసింది. కానీ ఆ అమ్మాయి మైనర్ కావడంతో పెళ్లికి బ్రేకులు పడ్డాయి.…
Himanta Biswa Sarma: అస్సాంలో బాల్య వివాహాలపై సీఎం హిమంత బిశ్వ శర్మ ఉక్కుపాదం మోపుతున్నారు. ఇలాంటి వివాహాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం వల్ల 2021-22, 2023-24 మధ్య కాలంలో రాష్ట్రంలోని 35 జిల్లాల్లో 20 జిల్లాల్లో ఇటువంటి కేసులు 81 శాతం తగ్గాయని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు. 2026 నాటికి అస్సాంలో బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలిస్తామని ముఖ్యమంత్రి శపథం చేశారు.
Supreme Court on Child Marriage: బాల్య వివాహాలపై తాజాగా సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. బాల్య వివాహాలపై మార్గదర్శకాలను జారీ చేసిన కోర్టు, బాల్య వివాహ నిరోధక చట్టాన్ని ఏ వ్యక్తిగత చట్టం ప్రకారం సంప్రదాయాలకు భంగం కలిగించరాదని పేర్కొంది. బాల్య వివాహం ఒక వ్యక్తి తన జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కును హరిస్తుందని కోర్టు పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి (CJI) డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం…
Kerala High Court: బాల్య వివాహాల నిషేధ చట్టం -2006, ఈ దేశంలో ప్రతీ పౌరుడికి మతంతో సంబంధం లేకుండా వర్తిస్తుందని కేరళ హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. ప్రతీ భారతీయుడు ముందుగా పౌరుడు ఆ తర్వాత ఒక మతంలోని సభ్యుడు అవుతాడని చెప్పింది.
Child Marriage: పాకిస్తాన్ దేశంలోని స్వాత్ లోయలో ఓ 70 ఏళ్ల వృద్ధుడు, 13 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్నాడు. ఈ వార్త అక్కడి మీడియాలో హెడ్‌లైన్‌గా మారింది.
కర్నూల్ జిల్లా ఆదోని మండలం పెద్ద హరివనం గ్రామానికి చెందిన నిర్మల చిన్నప్పటి నుంచి చదువులో చాలా చురుకుగా ఉండేది. చదువంతా ప్రభుత్వ విద్యాయాల్లోనే కొనసాగించింది. అయితే, ఎంతో పట్టుదలతో చదువుతున్న ఆమె ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాల్లో టాపర్ గా నిలిచింది.
చాలా దేశాల్లో బాల్య వివాహాలు నిషేధించబడ్డాయి. బాల్య వివాహాల ఉచ్చు నుండి పిల్లలను రక్షించడానికి చట్టాలు, క్రిమినల్ కోడ్ లు మరియు పోలీసు చర్యలు అనేకం ఉన్నాయి. కానీ సంప్రదాయాల ప్రాముఖ్యత ముందు ఎల్లప్పుడూ చట్టాలను అధిగమించినట్లైతుంది. తాజాగా ఘనా విషయంలోనూ అదే జరిగింది. చట్టవిరుద్ధమైనప్పటికీ, ఈ వివాహానికి సమాజం సాక్షిగా మాత్రమే కాదు, నాయకులు కూడా మద్దతు ఇచ్చారు. ఎక్కడైనా సరే ప్రజలు పూజారులను గౌరవప్రదమైన వ్యక్తులుగా పరిగణిస్తారు. ఇకపోతే.. Also Read: CM YS…
Himanta Biswa Sarma: బంగ్లాదేశ్ నుంచి వచ్చి బెంగాలీ మాట్లాడే ‘మియా ముస్లింలు’ స్థానికులుగా గుర్తింపు పొందాలంటే కొన్ని షరతులు పాటించాలని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కోరారు.