Himanta Biswa Sarma: అస్సాంలో బాల్య వివాహాలపై సీఎం హిమంత బిశ్వ శర్మ ఉక్కుపాదం మోపుతున్నారు. ఇలాంటి వివాహాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం వల్ల 2021-22, 2023-24 మధ్య కాలంలో రాష్ట్రంలోని 35 జిల్లాల్లో 20 జిల్లాల్లో ఇటువంటి కేసులు 81 శాతం తగ్గాయని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు. 2026 నాటికి అస్సాంలో బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలిస్తామని ముఖ్యమంత్రి శపథం చేశారు.
Read Also: US: అమెరికా వీధుల్లో ‘మేడ్ ఇన్ ఇండియా’ మ్యాన్‌హోల్ కవర్లు..! నెట్టింట చర్చ?
బాల్య వివాహాల నిర్మూలించడానికి అస్సాం సీఎం చేస్తున్న కృషిని ఇటీవల ఎన్డీయే ముఖ్యమంత్రుల సమావేశంలో కొనియాడారు. ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో జరిగిన ఎన్డీయే సీఎంలు, డిప్యూటీ సీఎంల సమావేశంలో అస్సాం రాష్ట్రనేతలు, రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులు, ఎంపీలు చేస్తున్న కృషిని ప్రధాని ప్రశంసించారని హిమంత చెప్పారు. బాల్య వివాహాలను నిర్మూలించడానికి ఇతర రాష్ట్రాలు కూడా అస్సాం నమూనాను పాటించాలని ప్రధాని కోరినట్లు తెలిపారు. అస్సాంలో బాల్య వివాహాలను ఎలా నిర్మూలించారో ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి ఆ రాష్ట్రాన్ని సందర్శించాలని ప్రధాని మోడీ అధికారులను కోరారు.