బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం అని ప్రభుత్వాలు అవగాహన కల్పిస్తున్నప్పటికీ కొందరు మాత్రం మారడం లేదు. ఇంట్లో ఉన్న తాతయ్యలు, నానమ్మ, అమ్మమ్మలు తమ మనుమరాలు, మనువడి పెళ్లి చూసి చనిపోవాలి అని తమ కోరికలను వెలిబుచ్చుతుంటారు. వాళ్ల కోరికలను కాదనలేక పిల్లలకు పెళ్లి చేసేందుకు రెడీ అవుతుంటారు. ఇదే తరహాలో హర్యానాలో ఓ నానమ్మ మునిమనవడిని చూడాలనే కోరకతో తన మనుమరాలికి పెళ్లి చేయాలని చూసింది. కానీ ఆ అమ్మాయి మైనర్ కావడంతో పెళ్లికి బ్రేకులు పడ్డాయి. అధికారుల ఎంట్రీతో వివాహం రద్దైంది.
Also Read:Jagdeep Dhankhar: ఆ మాటే కేంద్ర పెద్దలకు కోపం తెప్పించింది.. ధన్‌ఖర్ రాజీనామా మిస్టరీ ఇదే!
జాతల్ రోడ్‌లోని రాధా కృష్ణ ఆలయంలో జరుగుతున్న ఒక టీనేజర్ నిశ్చితార్థాన్ని సోమవారం మహిళా, శిశు రక్షణ, బాల్య వివాహ నిషేధ అధికారి రజని గుప్తా అడ్డుకున్నారు. ఆ టీనేజర్ నిశ్చితార్థం ఆమె నానమ్మ అనుమతితో జరిగింది. నానమ్మ అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమె చివరి కోరిక తన మునిమనవడిని చూడడమే. అందుకే ఆ టీనేజర్ నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేశారు. నిశ్చితార్థం ఆగిపోయింది. ఇరువైపుల నుంచి అఫిడవిట్లు కూడా తీసుకున్నారు. దీనిలో ఆ టీనేజర్ మేజర్ అయ్యే వరకు వివాహం చేసుకోదని హామీ ఇచ్చారు.
Also Read:ART CINEMASS: రవితేజ ART మాల్.. ఓపెనింగ్ ఆ సినిమాతోనే
మహిళా, శిశు రక్షణ, బాల్య వివాహ నిషేధ అధికారిణి రజని గుప్తా మాట్లాడుతూ.. 15 ఏళ్ల బాలిక ఢిల్లీలోని ఆజాద్‌పూర్ నివాసి అని, ఆమె ఇద్దరు తోబుట్టువులలో పెద్దది అని, ఆమె ఆరో తరగతి వరకు చదువుకుందని, ఆమె నానమ్మ వయసు దాదాపు 80 సంవత్సరాలు, అనారోగ్యంతో ఉందని, జాతల్ రోడ్‌లో నివసిస్తున్న తన కుమార్తెను తన మనవరాలి వివాహం చేయమని ఆమె నానమ్మ కోరిందని తెలిపారు.
Also Read:ART CINEMASS: రవితేజ ART మాల్.. ఓపెనింగ్ ఆ సినిమాతోనే
ఆ కూతురు తన 15 ఏళ్ల మేనకోడలి వివాహం సనౌలి రోడ్డులో నివసించే 24 ఏళ్ల సౌరభ్ తో ఏర్పాటు చేసింది. రెండు రోజుల క్రితం ఆ యువకుడిని ఢిల్లీ నుంచి పానిపట్ కు పంపించారు.
జాతల్ రోడ్డులోని రాధా కృష్ణ ఆలయం సమీపంలో సోమవారం ఆమె నిశ్చితార్థం జరిగింది. ఈ క్రమంలో రజని గుప్తకు దీని గురించి రహస్య సమాచారం అందింది. ఆమె పోలీసులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని అబ్బాయి, అమ్మాయి జనన ధృవీకరణ పత్రాలను తనిఖీ చేసింది. ఆ అమ్మాయి మైనర్ అని తేలింది. దీంతో ఆమె నిశ్చితార్థాన్ని ఆపేసింది.
Also Read:ART CINEMASS: రవితేజ ART మాల్.. ఓపెనింగ్ ఆ సినిమాతోనే
ఆ అబ్బాయి బంధువులు మాట్లాడుతూ- ఆ అమ్మాయి మైనర్ అని తమకు తెలియదని అన్నారు. ఆ అమ్మాయి మేజర్ అయ్యాక పెళ్లి చేసుకుంటామని చెప్పారు. తన మేనకోడలి వివాహం చేయమని తన తల్లి బలవంతం చేసిందని అత్త చెప్పింది. మైనార్టీ తీరక ముందే ఆడపిల్లలకు తొందరపడి పెళ్లి చేయొద్దని మహిళా శిశు రక్షణ, బాల్య వివాహ నిషేధ అధికారిణి రజనీ గుప్తా తెలిపారు.