స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు ముద్దాయి అని మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. నాకు ఏమీ లేదు అని చెప్పే చంద్రబాబు కోట్ల రూపాయలు వెచ్చించి ఢిల్లీ నుంచి లాయర్లను తెప్పించుకున్నారు.. ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి మీద కేసు నమోదు చేస్తే అక్రమ కేసు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి వ్యాఖ్యానించడం సరికాదు
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని సీఐడీ అధికారులు అక్రమంగా అరెస్ట్ చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. లండన్ నుంచే చంద్రబాబు అరెస్టును సీఎం జగన్ మానిటరింగ్ చేస్తున్నాడు అని ఆయన అన్నారు.
ఈ కేసులో చంద్రబాబుకు కానీ నాకు కానీ మా కుటుంబాలకు కానీ పైసా లబ్ది చేకూరినట్టు నిరూపించినా "పీక కో సుకుంటాను" అని అచ్చెన్నాయుడు అన్నారు. చంద్రబాబును విచారణ పేరుతో రెండు రోజులు నిద్ర కూడా లేకుండా ఇబ్బందులు పెట్టారు.
రిమాండ్ రిపోర్ట్ ను తిరస్కరించాలని సిద్ధార్థ లూద్రా నోటీసు ఇచ్చాడు. తిరస్కరణపై వాదనలకు న్యాయమూర్తి హిమ బిందు అనుమతి ఇచ్చింది. దీంతో ఇరు వర్గాల మధ్య వాదనలు కొనసాగుతున్నాయి.
ఈ రిమాండ్ రిపోర్టులో నారా లోకేష్ పేరును కూడా చేర్చారు. చంద్రబాబు సన్నిహితుడు కిలారు రాజేష్ ద్వారా నారా లోకేష్ కు డబ్బులు అందినట్టు రిమాండ్ రిపోర్ట్ లో సీఐడీ అధికారులు పేర్కొన్నారు.
అన్నీ ఆధారాలతోనే చంద్రబాబు అరెస్ట్ చేశారని ఆయన వ్యాఖ్యనించారు. కోర్టు ఏ నిర్ణయంతో.. వాస్తవాలు తెలుస్తాయి.. చంద్రబాబును జైలుకు పంపించాలని టార్గెట్ చేసుంటే ఇన్ని రోజులు ఎందుకు వెయిట్ చేస్తారు.. చంద్రబాబును అరెస్టు చేయటానికి ఐదేళ్లు ఎదురు చూస్తారా అని బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
AP Police Stopped Pawan Kalyan at Garikapadu Checkpost: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ చీఫ్ చంద్రబాబు అరెస్ట్ రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఇక ఆయన అరెస్టు ఖండించిన పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు మద్దతుగా ఆయనని కలిసేందుకు విజయవాడ వెళ్లేందుకు ప్రయత్నించారు. ప్రత్యేక విమానంలో గన్నవరం వెళ్ళడానికి బేగంపేట ఎయిర్ పోర్ట్ కు పవన్ కళ్యాణ్ వెళ్లగా ఆయన వెళ్లే విమాననానికి అనుమతి లేదని అధికారులు వెనక్కి పంపారు. ఈ క్రమంలో…
తాడేపల్లి సీఐడీ సిట్ కార్యాలయంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఐడీ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. సీఐడీ అడిగే ప్రశ్నలకు చంద్రబాబు సరిగా సమాధానం చెప్పడం లేదని సమాచారం తెలుస్తోంది.
చంద్రబాబును అరెస్ట్ చేయడం సబబే.. స్కీం ను స్కాం గా మార్చారని వెంకటగిరి వైసీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి అధికారంలోకి వచ్చారని దుయ్యబట్టారు.