చంద్రబాబు కేసుకు సంబంధించి రిమాండ్ రిపోర్టులో సీఐడీ చీఫ్ నిన్న చెప్పిన అంశాలనే దర్యాప్తు అధికారి ప్రధానంగా పేర్కొన్నారు. కోర్టుకు రిమాండ్ రిపోర్టును సీఐడీ అధికారులు అందించారు. నేరపూరిత కుట్ర, నిధుల దుర్వినియోగం, ప్రభుత్వ నిధులను సొంతానికి వాడుకోవడం అనే అంశాలపై చంద్రబాబుపై నేరాభియోగం మోపారు. ఉద్దేశవూర్వకంగా మోసం చేయడం, ఫోర్జరీ చేసి మోసం చేయడం, డాక్యుమెంట్లను కూడా ఫోర్జరీ చేయడం, సాక్ష్యాధారాలను మాయం చేయడం, వంటి అభియోగాలను రిమాండ్ రిపోర్టులో పొందుపర్చారు.
Read Also: Harassment: ఆ స్టార్ హీరో సినిమాలు చూస్తున్నందుకు భార్యను కొట్టిన భర్త.. పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు
ప్రజా సేవకుడిగా తన స్థానాన్ని దుర్వినియోగం చేశారని నివేదికలో సీఐడీ అధికారులు తెలిపారు. డిజైన్ టెక్, సీమన్స్ ఎండీలతో కలిసి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని చంద్రబాబుపై అభియోగాలు మోపారు. 279 కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం అయినట్లు రిమాండ్ రిపోర్టులో సీఐడీ అధికారులు పేర్కొన్నారు. డిజైన్ టెక్ సంస్థ… కొన్ని సంస్థలకు నిధులు బదిలీ చేసిన సమయంలో జీఎస్టీ ఎగవేసిందని రిమాండ్ రిపోర్టులో సీఐడీ పేర్కొంది.
Read Also: Janasena: నేడు మంగళగిరిలో జనసేన పీఏసీ సమావేశం
దీని ఆధారంగా దర్యాప్తు చేస్తే అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయని పేర్కొన్న సీఐడీ అధికారులు తెలిపారు. టెక్నాలజీ పార్టనర్లుగా నామినేషన్ పద్దతిలో ఈ సంస్థలను నియమించారని, వారికి 371 కోట్ల రూపాయలు ప్రభుత్వ వాటా కింద చంద్రబాబు ఆదేశాల మీద చెల్లించారని రిమాండ్ రిపోర్టులో సీఐడీ అధికారులు పేర్కొన్నారు. ఈ విధంగా చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందని, తమ స్వార్ధం కోసం ఈ విధంగా చేశారని అధికారులు వెల్లడించారు. ఇక, ఈ రిమాండ్ రిపోర్టులో నారా లోకేష్ పేరును కూడా చేర్చారు. చంద్రబాబు సన్నిహితుడు కిలారు రాజేష్ ద్వారా నారా లోకేష్ కు డబ్బులు అందినట్టు రిమాండ్ రిపోర్ట్ లో సీఐడీ అధికారులు పేర్కొన్నారు.