పవన్ కల్యాణ్ వస్తుంటే మీరు ఎందుకు భయపడుతున్నారని నాదెండ్ల ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ వచ్చి మంగళగిరి పార్టీ ఆఫీసులో భవిష్యత్తు కార్యచరణ నిమిత్తం సీనియర్ నాయకులతో సమావేశం నిమిత్తం రానున్నారని తెలిపారు.
గన్నవరం ఎయిర్ పోర్టు దగ్గర పోలీస్ బలగాలు భారీగా మోహరించాయి. కాసేపట్లో గన్నవరం విమానాశ్రయంకు పవన్ కళ్యాణ్ చేరుకోనున్నారు. అయితే పవన్ ను బయటకు వెళ్ళకుండా ఆపేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.
విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లుధ్ర వాదనలు వినిపించనున్నారు. ఈ సందర్భంగా.. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సిద్ధార్థ లోధ్రా అండ్ టీమ్ గన్నవరం విమానాశ్రయంకు చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరఫున బెయిల్ పిటిషన్ పై వాదనలు వినిపించనున్నారు సిద్ధార్థ లుద్ర.
Nandamuri Ramakrishna Becomes Emtional on Chandrababu Arrest: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ వార్త ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఈ విషయంలో వైసీపీ శ్రేణలు ఆనందం వ్యక్తం చేస్తుంటే టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఇది అప్రజాస్వామికం అని అన్నారు. ఇక బాబు అరెస్టుపై ఆయన సతీమణి నారా భువనేశ్వరి స్పందించారు. విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని ఇవాళ నారా భువనేశ్వరి దర్శించుకున్నారు, ఆమెతో ఉన్న ఆమె సోదరుడు నందమూరి…
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు కావటం దురదృష్టకరమని విమర్శించారు. ఇది అక్రమ అరెస్టు కాదు.. అనివార్యమైన అరెస్టు అన్నారు.
చంద్రబాబు అరెస్ట్ పై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా విజయనగరంలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్మెంట్లో అవకతవకలు జరిగాయని ఈడీ పేర్కొందని తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ రాజ్యాంగబద్ధంగా, చట్టపరంగా జరిగిందని అన్నారు.