సీఎం జగన్ కు సవాల్ విసిరే స్థాయి నారా లోకేష్ కు లేదని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. లోకేష్ స్థాయి ఏమిటి, లోకేష్ బ్రతుకు ఏమిటని ఆయన అన్నారు. ఈడీ, సీఐడీ ఇన్కమ్ టాక్స్ చర్చకు రమ్మని పిలుస్తున్నాయి.. వాటికి ముందు సమాధానం చెప్పు.. 118 కోట్లుకు సంబంధించి ఇన్ కం ట్యాక్స్ పిలిస్తే తప్పించుకుని తిరుగుతున్నారు అంటూ మంత్రి సెటైర్ వేశారు.
చంద్రబాబు లాంటి సీనియర్ నేతను, విజనరీ లీడర్ ను. అన్యాయంగా అరెస్ట్ చేశారు అంటూ ఆమె పేర్కొన్నారు. ఎలాంటి ఎవేడేన్స్ లేకుండా అన్యాయంగా అరెస్ట్ చేశారు.. లక్షలాది మందికి స్కిల్స్ ద్వారా ఉద్యోగాలు వచ్చేలా చేశారు.. సంక్షేమం చేయడం నేరమా అని బ్రహ్మణి అడిగారు.
చంద్రబాబు తెలుగు ప్రజలకు బ్రాండ్ అంబాసిడర్.. ఈ ప్రాంతం కోసం చంద్రబాబు చేసిన కృషిని ఎవ్వరూ మరిచిపోకూడదు.. రాజకీయ కక్షతోనే చంద్రబాబు అరెస్ట్ జరిగింది.. పవన్ వస్తానంటే విమానం ఎక్కడానికి కూడా అనుమతి లభించని పరిస్థితి.. ఫ్లైట్ ఆపేయడం ఏంటంటూ ఆశ్చర్యపోయామని నాదేండ్ల మనోహార్ అన్నారు.
Pawan Kalyan to Meet Chandrababu in Rajahmundry Central jail: ఏపీ నుంచి బిగ్ బ్రేకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. రేపు రాజమండ్రికి జనసేనాని పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. రాజమండ్రి జైల్లో స్నేహ బ్లాక్ లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు తో జనసేన అధ్యక్షుడు పవన్ ములాఖాత్ కానున్నారు. జైలులో ఇద్దరు అగ్రనేతలు కలవనున్న క్రమంలో ఎలాంటి అంశాలు చర్చకు రానున్నాయి అనేది హాట్ టాపిక్ అవుతోంది. చంద్రబాబుకు మద్దతు తెలిపి, ధైర్యం చెప్పడానికి…
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం లో టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టేయాలని ఆయన తరపున న్యాయవాదులు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఏపీ హైకోర్టులో ఈ కేసు విచారణ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది.
సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలోని శాంతి భద్రతలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. గత పది రోజులుగా జరిగిన పరిణామాలను సీఎం జగన్ కు కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి సహా పోలీస్ శాఖ ఉన్నతాధికారులు వివరించారు.
చంద్రబాబుకి శిక్షపడాలని అందరూ కోరుకున్నారు అని అన్నారు. ఇప్పుడు చంద్రబాబుకి శిక్షపడడంతో మ్రొక్కులు చెల్లించుకున్నాను అని ఆమె పేర్కొన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లోని స్నేహ బ్లాక్ లో చంద్రబాబుకి పూర్తిస్థాయిలో భధ్రతా ఏర్పాట్లు కల్పించామని మంత్రి రోజా అన్నారు.
హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై కేసు పెట్టడానికి ముందే ప్లాన్ చేశారు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం.. అవినీతి జరిగిందని చంద్రబాబుపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు.