స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు ముద్దాయి అని మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. నాకు ఏమీ లేదు అని చెప్పే చంద్రబాబు కోట్ల రూపాయలు వెచ్చించి ఢిల్లీ నుంచి లాయర్లను తెప్పించుకున్నారు.. ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి మీద కేసు నమోదు చేస్తే అక్రమ కేసు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి వ్యాఖ్యానించడం సరికాదు అంటూ ఆయన కామెంట్స్ చేశారు. చంద్రబాబు ఆదేశాల మేరకే నిధులను విడుదల చేశారు.. అక్రమాలకు పాల్పడిన వారిని అరెస్టు చేయకూడదా అని అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు.
Read Also: Chandrababu Arrested Live Updates: రిమాండ్ రిపోర్టులో లోకేష్ పేరు.. ఏం జరగబోతోంది.!
చంద్రబాబు అరెస్టుతో టీడీపీ మరింత దిగజారింది అని మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. చంద్రబాబు అరెస్ట్ కు ప్రజల్లో స్పందన లేకపోవడంతో దత్తపుత్రుడుని తీసుకువచ్చి హంగామా చేశారు అని ఆయన అన్నారు. ఇంకా అమరావతి.. ఆదాయ పన్ను అక్రమాలు ఉన్నాయి.. అవి కూడా బయటకు వస్తాయని ఆయన పేర్కొన్నారు. అక్రమాల కేసుల్లో పూర్తి వివరాలు సేకరించిన తరువాతే అధికారులు కేసు నమోదు చేశారు అని మాజీ మంత్రి అన్నారు. ఏ స్థాయిలో ఉన్నా.. తప్పు చేస్తే కేసులు తప్పవని తమ ప్రభుత్వం నిరూపించింది అని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. చంద్రబాబు అరెస్ట్ పై టీడీపీ నేతలు ఓవరాక్షన్ చేస్తున్నారని అనిల్ కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు తప్పు చేసిన వారిని వదిలే ప్రసక్తి లేదని ఆయన తేల్చి చెప్పారు.
Read Also: MLA Rajaiah: చివరి నిమిషంలో ఏమైనా జరగొచ్చు.. టికెట్ నాకే వస్తుందన్న నమ్మకం ఉంది