రాష్ట్రంలో రాజకీయ కాక్ష తప్ప చట్టం, ధర్మం లేదు అని టీడీపీ నేత అచ్చెన్నాయుడు అన్నారు. నిన్నటితో పిచ్చి పరాకాష్టకు చేరింది.. స్కిల్ కేసులో ఇరికించి చంద్రబాబును దారుణాతి దారుణంగా సీఐడీ కస్టడీలోకి తీసుకుంది.. చంద్రబాబు అరెస్టు ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని ఆయన ప్రకటించారు. 2015-16లో జీవో ఇచ్చి కేబినెట్లో చర్చించి ప్రవేశ పెట్టిన బడ్జెట్ ను అసెంబ్లీ ఆమోదించింది.. స్కిల్ డవలప్ మెంట్ ప్రాజెక్ట్ వల్ల ఎందరో శిక్షణ పొందారని సీఐడీనే చెప్పింది.. స్కిల్ అక్రమాలు కేసు ఊహాజనితమైన అంశాలపై ఆధారపడి పెట్టినవే అచ్చెన్నాయుడు తెలిపారు.
ఈ కేసులో చంద్రబాబుకు కానీ నాకు కానీ మా కుటుంబాలకు కానీ పైసా లబ్ది చేకూరినట్టు నిరూపించినా “పీక కో సుకుంటాను” అని అచ్చెన్నాయుడు అన్నారు. చంద్రబాబును విచారణ పేరుతో రెండు రోజులు నిద్ర కూడా లేకుండా ఇబ్బందులు పెట్టారు.. సీఐడీ చీఫ్ ప్రెస్మీట్ లో చెప్పిన విషయాలు రిమాండ్ రిపోర్టులో పొందు పరిచారు అని ఆయన ఆరోపించారు. ఈ రిమాండ్ రిపోర్టు కట్టు కథ.. స్కిల్ డవలప్ మెంట్ కార్పొరేషన్ మొదట్లో నా దగ్గర లేదు.. కేబినెట్లో చివర్లో నా శాఖ పరిధిలోకి వచ్చింది అని అచ్చెన్నా అన్నారు.
Read Also: Chandrababu Naidu: పెళ్లిరోజుకు.. ఒకరోజు ముందు చంద్రబాబు అరెస్ట్!
అధికారుల సమక్షంలో కేబినెట్లో చర్చించి తీసుకున్న నిర్ణయంలో చంద్రబాబు ఆయన తోక నేను అని ఇప్పుడు చెబుతున్నారు అని అచ్చెన్నాయుడు అన్నారు. రెండేళ్ల క్రితం నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో నా పేరు కానీ, చంద్రబాబు పేరు కానీ లేదు.. ఇప్పటికే పలువురు అరెస్ట్ అయ్యి జైళ్లకు వెళ్లి వచ్చారు.. అటువంటిది ఇప్పుడు మాపై కేసులు పెట్టడం దురుద్దేశంతో కుడినవే అని ఆయన పేర్కొన్నారు. స్కిల్ స్కామ్ లో బాధ్యులైన ప్రభుత్వ అధికారుల పేర్లు ఎందుకు పెట్టలేదో సీఐడీ చెప్పాలి అని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.