స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు సీఐడీ విచారణ ముగిసింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్న చంద్రబాబును రెండు రోజుల్లో 12 గంటల పాటు సీఐడీ అధికారులు విచారించారు. విచారణ అనంతరం చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. సీఐడీ విచారణతో పాటు రిమాండ్ గడువు కూడా ముగిసింది
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు రెండు రోజుల సీఐడీ కస్టడీ కొద్ది నిమిషాల్లో ముగియనుంది. సీఐడీ కస్టడీ తర్వాత వర్చువల్ విధానంలో టీడీపీ అధినేత చంద్రబాబును ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ముందు సీఐడీ అధికారులు ప్రవేశపెట్టనున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు ఆ పార్టీ రాజకీయ కార్యక్రమాల పర్యవేక్షణకు టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ నియామకమైంది. 14 మందితో టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేశారు.
చంద్రబాబు అరెస్ట్ పై ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. చంద్రబాబుని అరెస్ట్ చేసి సీఎం జగన్ రెడ్డి భయపడడం సిగ్గుచేటు.. చంద్రబాబుకి దేశ వ్యాప్తంగా వస్తున్న మద్దతు చూసి జగన్ రెడ్డి వెన్నులో వణుకు మొదలయింది..
చంద్రబాబు రెండో రోజు మొదటి సెషన్ సీఐడీ అధికారుల విచారణ ముగిసింది. ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు లంచ్ బ్రేక్ ఇచ్చారు. అయితే, సీఐడీ అధికారులకు మరొక మూడున్నర గంటలు మాత్రమే మిగిలి ఉంది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అన్ని రంగాలు కుదేలౌతుంటే ఆధారాలు లేని స్కాముల పేరుతో సీఎం జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారు అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. అర్థాంతరంగా అరెస్టు చేసి, కోర్టుల ముందు అబద్దాలు పెట్టి చంద్రబాబు నిర్భందాన్ని కొనసాగిస్తున్నారు.
హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి ఐటీ ప్రొఫెషనల్స్ కార్ల ర్యాలీ తీశారు. నేడు (ఆదివారం) తెల్లవారుజాము నుంచే ఈ ర్యాలీ స్టార్ట్ అయింది. కారులతో సంఘీభావ యాత్ర అనే పేరుతో నిర్వహిస్తున్న ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున ఐటీ ఉద్యోగులు పాల్గొన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి అరెస్ట్ రాజ్యాంగ విరుద్ధం అని బీఆర్ఎస్ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ఇదే ఎన్టీఆర్ ఘాట్ నుంచి జగన్ గెలవాలని కోరుకున్నా.. నా మాట ప్రకారం దళిత వర్గాలంతా ఏకమై జగన్ ను గెలిపించారు.. గెలిచిన తర్వాత జగన్ కు ఒక మైకం వచ్చింది.