టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, శ్రేణులు పెద్ద ఎత్తున మోత మోగిద్దం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక రాజమండ్రిలోని టీడీపీ క్యాంపు కార్యాలయం దగ్గర మోత మోగిద్దాం నిరసన కార్యక్రమంలో నారా బ్రాహ్మణి, తెలుగు మహిళలు పాల్గొన్నారు.
టీడీపీ పార్టీ మోతలు ఎందుకు.. లంచాలు తీసుకొని కంచాలు కొట్టడం ఎందుకు.. అన్ని కోర్టులు తిరస్కరించాకే చంద్రబాబు జైల్లో ఖైదీగా ఉన్నాడు.. ఎవరి కోసం హారన్లు.. ఎవరి కోసం విజిల్స్? అంటూ విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశాడు.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏపీ సీఐడీ అధికారులు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు నోటీసులు ఇచ్చారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ14గా లోకేష్ కు సీఐడీ 41ఏ నోటీసులు పంపించింది. అక్టోబర్ 4వ తేదీ ఉదయం 10 గంటలకు సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని తెలిపింది.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై చాలా కేసులున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఇప్పటి వరకు చంద్రబాబు స్టేలు తెచ్చుకొని నెట్టుకొచ్చారు.. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో తప్పించుకోలేకపోయారు అని ఆయన విమర్శించారు.
నా చెల్లి నారా భువనేశ్వరి కూడా ఈ దీక్షలో కూర్చుంటారు అంటూ నందమూరి బాలకృష్ణ తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహీ యాత్రకు టీడీపీ తరపున మా పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాము అని ఆయన పేర్కొన్నారు. మా పార్టీ తరఫున ఐదు మందిని, జనసేన తరుఫున 5మందీతో కమిటీ వేస్తామని చెప్పారు.
Ravibabu: జీవితంలో ఏవీ శాశ్వతం కాదన్నారు యాక్టర్, డైరెక్టర్ రవిబాబు. సినిమా వాళ్ల గ్లామర్ రాజకీయ నాయకుల పవర్ గానీ అసలు శాశ్వతం కాదన్నారు. అలాగే చంద్రబాబుకు వచ్చిన కష్టాలు కూడా త్వరలోనే తొలిగిపోతాయన్నారు.
చంద్రబాబు కోర్ట్ తీర్పు ప్రకారం రిమాండ్ కి వెళ్ళారు అని ఆయన అన్నారు. చట్టం తన పని తాను చేసుకుంటుంది.. అవినీతి చేసిన వారిని ఎవరిని వదిలేది లేదు.. హెరిటేజ్ సంస్థ నుంచి వచ్చే డబ్బులు ఉన్నప్పటికీ.. అవినీతి సొమ్ముకు చంద్రబాబు ఆశ పడ్డాడు.. ఇన్నర్ రింగ్ లేకుండా అవినీతి ఎలా జరుగుతుంది అని ప్రశ్నించే టీడీపి నేతలుకి అక్కడ భూముల రెట్లు ఎందుకు పెరిగాయో తెలియదా అని ఆదిమూలపు సురేష్ ప్రశ్నించారు.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను ఆంధ్ర ప్రదేశ్ హైకోర్ట్ సెప్టెంబర్ 29కి వాయిదా వేసింది. శుక్రవారం మధ్యాహ్నం 2.15 గంటలకు వాదనలు వింటామని న్యాయమూర్తి వెల్లడించింది.
సీజేఐ ధర్మాసనం ఈ పిటిషన్‌పై వాదనలు వినడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సందర్భంగా మీకేం కావాలని చంద్రబాబు తరుఫున లాయర్ సిద్ధార్థ లూథ్రాను సీజేఐ ధర్మాసనం అడిగింది. లూథ్రా వాదనలు వినిపిస్తూ.. కేసు ఈ రోజు లిస్టయినా విచారణకు జరుగలేదు అని తెలిపారు. మరో బెంచ్‌కు కేసును బదిలీచేస్తామని సీజేఐ ధర్మాసనం తెలుపుతూ.. విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. మరో 11 రోజుల పాటు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి చంద్రబాబుకు రిమాండ్ పొడిగించారు. ఆయన రిమాండ్‌ను అక్టోబర్ 5 వరకు ఏసీబీ కోర్టు పొడిగించింది.