AP CID: నేడు రెండో రోజు సీఐడీ కస్టడీకి చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుని ఇవాళ (ఆదివారం) ఏపీ సీఐడీ అధికారులు రెండో రోజు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించనున్నారు. తొలిరోజు నిన్న ( శనివారం ) రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ.. దాదాపు 6 గంటల పాటూ ఆయన్ని ప్రశ్నించారు. మధ్యలో 1 గంట భోజనానికి సమయం కేటాయించారు. చంద్రబాబు తరపు సమక్షంలో ఈ విచారణ జరిగింది. నిన్న చంద్రబాబు విచారణలో మొత్తం 12 మంది సీఐడీ అధికారులు పాల్గొన్నారు.
Read Also: Turmeric Price Hike: నాలుగు నెలల్లో 180శాతం పెరిగిన పసుపు ధర
Also Read
- Mamata Banerjee: "జానీ జానీ ఎస్ పప్పా.. జ్ఞానేశ్ కుమార్ నో పప్పా!".. ఢిల్లీలో మమతా బెనర్జీ హల్చల్
- BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
- 3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
- కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
ఈ స్కిల్ స్కాం కేసులో మొత్తం రూ.371 కోట్ల కుంభకోణం జరిగిందనీ సీఐడీ అధికారులు ఆరోపిస్తున్నారు. అందులో జీఎస్టీ తీసేయగా.. రూ.301 కోట్లు మనీ ఉందనీ.. 60 కోట్ల రూపాయలు నిజంగానే స్కిల్ డెవలప్‌మెంట్ కోసం ఖర్చు చేసినా.. మిగతా రూ.241 కోట్లకు సంబంధించి లెక్కలు చెప్పాలని చంద్రబాబుని సీఐడీ అధికారులు ప్రశ్నించారు. ప్రధానంగా 10 ప్రశ్నలను ముందు ఉంచి విచారణ వేసినట్లు తెలిసింది. అవి.. మొత్తం ఈ ప్రాజెక్టు విలువ ఎంత? ఈ ప్రాజెక్టు విలువ గుజరాత్ కంటే ఏపీలో ఎందుకు ఎక్కువగా ఉంది? కాంట్రాక్ట్‌ను ఏ ప్రాతిపదికన ఇచ్చారు? సబ్ కాంట్రాక్టులను ఎలా ఇచ్చారు? నిధుల విడుదలపై మీరు ఆర్థిక శాఖపై ఒత్తిడి తెచ్చారా? ఈ ఫైల్ లోని 13 సంతకాలు మీరే చేశారా? లాంటి ప్రశ్నలను సీఐడీ అధికారులు చంద్రబాబును అడిగినట్లు సమాచారం. నిన్న చంద్రబాబు చెప్పిన ఆన్సర్స్ ను బట్టి.. సీఐడీ అధికారులు కొత్త ప్రశ్నావళిని రెడీ చేసుకున్నట్లు తెలుస్తుంది.
ఇవాళ చంద్రబాబును సూటిగా మరిన్ని ప్రశ్నలు సీఐడీ అధికారులు అడగనున్నట్లు తెలుస్తుంది. ఈ ప్రశ్నలకు వచ్చే ఆన్సర్స్ ను బట్టి.. ఆయన్ని మరిన్ని రోజులు కస్టడీలోకి తీసుకోవాలా లేదా, ఇక్కడితో విచారణ ముగించాలానేది నేటి సాయంత్రం నిర్ణయం తీసుకోనున్నారు. మరిన్ని రోజులు ప్రశ్నించాలి అనుకుంటే, మరోసారి కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టును సీఐడీ అధికారులు కోరే అవకాశం ఉంది. దీంతో నేటి సాయంత్రానికి చంద్రబాబు నాయుడి రిమాండ్ అదనపు గడువు ముగుస్తుంది.
Read Also: Neha Sharma : ఉబికి వచ్చే అందాలను దాచలేకపోతున్న నేహా శర్మ..
దీంతో రేపు( సోమవారం) చంద్రబాబుని సీఐడీ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏసీబీ జడ్జి ముందు ప్రవేశ పెడతారు. రిమాండ్ పొడిగించాలా వద్దా అనే దానిపై జడ్జి నిర్ణయం తీసుకుంటారు. చంద్రబాబు బెయిల్ కోసం దాఖలైన పిటిషన్లను కోర్టు రేపు ఎంక్వైరీ చేయనుంది. అలాగే చంద్రబాబుపై అమరావతి రాజధాని రింగ్ రోడ్డు స్కాం కేసు, ఫైబర్ నెట్ స్కాం కేసుల్లో సీఐడీ అధికారులు దాఖలు చేసిన పీటీ వారెంట్లపై కూడా రేపే విచారణ చేయనుంది.
తాజావార్తలు
-
Mamata Banerjee: “జానీ జానీ ఎస్ పప్పా.. జ్ఞానేశ్ కుమార్ నో పప్పా!”.. ఢిల్లీలో మమతా బెనర్జీ హల్చల్
-
BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
Ranabaali Trailer: ‘రణబాలి’ ట్రైలర్‌పై మంత్రి లోకేష్ రివ్యూ!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!