Chandrababu Case: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు సీఐడీ విచారణ ముగిసింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్న చంద్రబాబును రెండు రోజుల్లో 12 గంటల పాటు సీఐడీ అధికారులు విచారించారు. విచారణ అనంతరం చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. సీఐడీ విచారణతో పాటు రిమాండ్ గడువు కూడా ముగిసింది. వర్చువల్ విధానంలో టీడీపీ అధినేత చంద్రబాబును విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ముందు సీఐడీ అధికారులు ప్రవేశపెట్టారు. కస్టడీ ముగియడంతో సీఐడీ అధికారులను చంద్రబాబు దగ్గర నుంచి వెళ్లిపోవాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఇదిలా ఉండగా.. చంద్రబాబు కస్టడీ, రిమాండ్‌ను పొడిగించాలని ఏసీబీ కోర్టు న్యాయమూర్తిని సీఐడీ కోరింది. చంద్రబాబు కస్టడీని పొడిగించాలని సీఐడీ పిటిషన్ దాఖలు చేయగా.. చంద్రబాబు లాయర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. రిమాండ్ పొడిగింపు పిటిషన్ పైనా చంద్రబాబు లాయర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. కాసేపట్లో చంద్రబాబుతో ఏసీబీ కోర్టు న్యాయమూర్తి వర్చువల్‌గా మాట్లాడనున్నారు.
Also Read: Chandrababu CID Custody: కాసేపట్లో ముగియనున్న చంద్రబాబు కస్టడీ.. నెక్స్ట్ ఏంటీ?
దీంతో ఏసీబీ కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో రిమాండ్, కస్టడీ.. ఈ రెండు అంశాలపై కాసేపట్లో క్లారిటీ రానుంది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌కు సంబంధించి సీఐడీ అధికారులు కొంత సమాచారం రాబట్టినట్టు సమాచారం. సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు ఆధ్వర్యంలో ఈ విచారణ కొనసాగింది.చంద్రబాబు విచారణను సీఐడీ అధికారులు వీడియో తీయించారు. కేసు ఇన్వెస్టిగేషన్ అధికారి డీఎస్పీ ధనుంజయుడి ఆధ్వర్యంలో రెండు బృందాలగా విడిపోయి విచారణ జరిగింది. ఒక్కో బృందంలో ఒక డీఎస్పీ, ఇద్దరు సీఐలు ఉన్నారు. రెండు రోజుల విచారణలో దాదాపు 120 ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. షెల్ కంపెనీల ద్వారా నిధుల మళ్లింపుపై ప్రధానంగా విచారణ జరిగినట్లు సమాచారం. చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్ కి హవాలా రూపంలో 118 కోట్ల అందిన వైనంపైనా ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది.13 చోట్ల చంద్రబాబు చేసిన సంతకాలపైనా ప్రశ్నలను సీఐడీ అధికారులు అడిగారు. ఆర్థిక శాఖ అభ్యంతరాలని పరిగణనలోకి తీసుకోకుండా 371 కోట్లు నిధులు ఎందుకు విడుదల చేశారని ప్రశ్నించారు. ఐఎఎస్ అధికారుల వాంగ్మాలాలను డాక్యుమెంట్లను ముందుపెట్టి చంద్రబాబుని అధికారులు ప్రశ్నించారు.