ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టైయ్యాడు. అయితే, ఏసీబీ కోర్టు రెండు రోజుల పాటు సీఐడీ అధికారులకు కస్టడికి ఇచ్చింది. ఇవాళ రెండో రోజు చంద్రబాబును సీఐడీ అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే, నిన్న చంద్రబాబును ప్రశ్నించిన సీఐడీ పలు కీలక ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తుంది. ఇక, ఇవాళ ఉదయం 9 గంటలకు విచారణ ప్రారంభమైంది. దాదాపు 4 గంటలకు పైగా చంద్రబాబును సీఐడీ అధికారులు ప్రశ్నించిన ఆయన దగ్గర నుంచి సరైన సమాధానాలు రాకపోవడంతో లంచ్ బ్రేక్ ఇచ్చారు.
Read Also: Kishan Reddy: మోడీ వస్తున్నారు.. మహబూబ్ నగర్, నిజామాబాద్ లో పర్యటిస్తారు..
ఇక, చంద్రబాబు రెండో రోజు మొదటి సెషన్ సీఐడీ అధికారుల విచారణ ముగిసింది. ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు లంచ్ బ్రేక్ ఇచ్చారు. అయితే, సీఐడీ అధికారులకు మరొక మూడున్నర గంటలు మాత్రమే మిగిలి ఉంది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు సెకండ్ సెషన్ లో సీఐడీ టీమ్ విచారణ చేయనుంది. సీఐడీ కస్టడీతో పాటు రిమాండ్ కూడా ముగియడంతో వర్చువల్ విధానంలో సాయంత్రం ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ముందు అధికారులు హాజరుపరచనున్నారు. మధ్యాహ్నం సెషన్ లో విచారణ ఒక కొలిక్కి తెచ్చే ప్రయత్నం సీఐడీ అధికారులు చేస్తు్న్నారు. రిమాండ్ విషయంలో కోర్టు తీర్పును బట్టి అవసరమైతే మరోసారి కస్టడీ పిటిషన్ వేయాలని సీఐడీ భావిస్తుంది.
Read Also: Bhagavanth Kesari: బాలయ్య సౌండ్ సరిపోవట్లేదు… కాస్త బేస్ పెంచండి
ఇక, రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర పరిస్థితులను జిల్లా ఎస్పీ జగదీష్ సమీక్షించారు. చంద్రబాబు రిమాండ్ గడువు సాయంత్రానికి ముగియడంతో పాటు ఐటీ ఉద్యోగులు కార్లతో ర్యాలీగా రావడం పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. సెంట్రల్ జైలు రోడ్ లో డీఎస్పీ స్థాయి అధికారితో ఎప్పటికప్పుడు పరిస్తితిని సమీక్షిస్తూ.. అప్రమత్తంగా ఉండాలని సూచన చేశారు. దీంతో జైలు పరిసర ప్రాంతాల్లో ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాలు జారీ చేశారు.