ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీకి తెరలేచింది. నేడు ఫిబ్రవరి 19న పాకిస్తాన్, న్యూజీలాండ్ మధ్య తొలి మ్యాచ్ జరిగింది. కరాచీలోని నేషనల్ స్టేడియం వేదికగా ఇరు జట్లు గెలుపు కోసం పోటీపడ్డాయి. తొలి మ్యాచ్ లో న్యూజీలాండ్ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించిన న్యూజీలాండ్ ఛాంపియన్ ట్రోఫీలో ఖాతా తెరిచింది. 60 పరుగుల తేడాతో పాక్ పై కివీస్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో భాగంగా ముందుగా టాస్ గెలిచిన పాకిస్తాన్ బౌలింగ్ ఎంచుకుంది.
Also Read:Health Tips: జొన్నల్లో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే అస్సలు వదలరు
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కివీస్ జట్టు బ్యాటింగ్ లో అదరగొట్టి భారీ స్కోర్ సాధించింది. నిర్ణీత 50ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 320 పరుగులు చేసింది. పాక్ ముందు 321 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ తడబడింది. కివీస్ బౌలర్ల ధాటికి పాక్ బ్యాటర్లు ఒక్కొక్కరు పెవిలియన్ బాట పట్టారు. పాకిస్తాన్ నిర్ణీత 47.2 ఓవర్లలో 260 పరుగుల మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది. ఛాంపియన్ ట్రోఫీలో తొలి ఓటమిని ఖాతాలో వేసుకుంది.
ఛాంపియన్ ట్రోఫీ తొలి మ్యాచ్ లోనే 2 సెంచరీలు నమోదయ్యాయి. న్యూజిలాండ్ ఓపెనర్ విల్ యంగ్ సెంచరీ సాధించాడు. 113బంతుల్లో 107 పరుగులుసాధించాడు.టామ్ లాథమ్ 104 బంతుల్లో 118 పరుగులు చేశాడు.