IND vs BAN: నేడే బంగ్లాతో టీమిండియా తొలి సమరం..
- ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్ తో తలపడనున్న భారత్..
- దుబాయ్ వేదికగా బంగ్లాను ఢీ కొట్టనున్న రోహిత్ సేన..
- తొలి మ్యాచ్ లో గెలిచి టోర్నీలో శుభారంభం చేయాలని భారత్ ప్లాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs BAN: ఛాంపియన్స్ ట్రోఫీలో తమ మొదటి మ్యాచ్ ను బంగ్లాదేశ్ తో భారత్ దుబాయ్ వేదికగా తలపడబోతుంది. ఇక, తమ తొలి మ్యాచ్‌లో ఈ రోజు (ఫిబ్రవరి 20) బంగ్లాదేశ్‌తో టీమిండియా తలపడుతుంది. ఇరు జట్ల బలాబలాలు, ఫామ్ పరంగా చూసుకుంటే రోహిత్ సేన బంగ్లా కంటే ఎంతో బలంగా కనిపిస్తుంది. అయితే, ఎప్పటిలాగే బంగ్లాదేశ్ తమ స్థాయికి మించిన ప్రదర్శన కనబర్చి సంచలనాన్ని సృష్టిస్తుంది. బ్యాటింగ్‌తో పాటు స్పిన్ ప్రధాన బలంగా భారత్ రంగంలోకి దిగుతుండగా… బంగ్లాదేశ్ తమ పేస్ బౌలింగ్‌పై గంపెడు ఆశలు పెట్టుకుంది.
Read Also: YS Jagan: వైఎస్ జగన్ గుంటూరు మిర్చియార్డ్ పర్యటన.. కేసు నమోదు..
Also Read
- Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
- Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
- Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
- T20I Rankings: ఆఫ్ఘనిస్తాన్ పై క్లీన్ స్వీప్ చేసినా.. నెం.1 ర్యాంక్ కోల్పోయిన టీమిండియా..!
ఇక, భారత్ తుది జట్టు కూర్పులో ఎలాంటి మార్పులు చేయకుండానే బరిలోకి దిగుతుందని సమాచారం. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, గిల్ శుభారంభం అందిస్తే ఆ తర్వాత కోహ్లి దానిని కొనసాగిస్తాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన లాస్ట్ వన్డేలో హాఫ్ సెంచరీ కొట్టిన కోహ్లి భారీ ఇన్నింగ్స్ ఆడాలని ఎదురు చూస్తున్నాడు. ఫాంలో ఉన్న శ్రేయస్ అయ్యర్‌తో పాటు ఐదో స్థానంలో కేఎల్ రాహుల్ కూడా ఆడితే టీమిండియాకు తిరుగుండదు. గత సిరీస్‌లో వరుస ప్రయోగాలతో కేఎల్ రాహుల్ స్థానం పలుమార్లు మార్చారు. కానీ, ఈ సారి మాత్రం అతనికి ఐదో స్థానంలోనే ఆడించే ఛాన్స్ ఉంది. హర్థిక్ పాండ్యా, జడ్డూ, అక్షర్‌ల ఆల్‌రౌండ్ నైపుణ్యం టీమ్ కు అదనపు బలగా చెప్పొచ్చు. మరోవైపు, బౌలింగ్ లో కుల్దీప్ చాలా రోజులుగా మంచి ఆటతీరు కనబరుస్తుంగా.. ఫేస్ విభాగంలో షమీ, అర్ష్ దీప్ ఉన్నారు.
Read Also: Bandi Sanjay: కాంగ్రెస్ నాయకులలో హిందూ రక్తం లేదా?.. ఈ అంశాలను ఎందుకు ప్రశ్నించరు?
అయితే, షకీబ్‌ల్ హసన్ లేకుండా 2004 తర్వాత బంగ్లాదేశ్ తొలిసారి ఒక పెద్ద టోర్నీ ఆడబోతుంది. లిటన్ దాస్ కూడా ఈ మెగా సమరంలో లేడు. కాగా, ఇతర సీనియర్లు ముష్పికర్, మహ్ముదుల్లా లాంటి ప్లేయర్లు మరోసారి టీమ్ భారం మోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. యువ బ్యాటర్లలో తన్‌జీద్, తౌహీద్ ఇటీవల పెద్దగా ఎఫెక్ట్ చూపించడం లేదు. అలాగే, కెప్టెన్ నజ్ముల్ చాలా కాలంగా ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్నాడు. ఇలాంటి పరిస్థితిలో ఈ బ్యాటింగ్ లైనప్ టీమిండియా బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోగలదనేది అనుమానంగానే మారింది. పేసర్లు ముస్తఫిజుర్, నాహిద్ రాణా, తస్కీన్‌లపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. స్పిన్ ఆల్‌రౌండర్ మెహదీ మిరాజ్ కీలకంగా వ్యవహరిస్తే బంగ్లాకు తిరుగే లేదు.
తుది జట్లు:
టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యార్, కేఎల్ రాహుల్ (వికట్ కీపర్), హార్థిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, అర్ష్ దీప్ సింగ్.
బంగ్లాదేశ్: నజ్ముల్ (కెప్టెన్), తన్‌జీద్, సౌమ్య సర్కార్, తౌహీద్, ముష్పికర్, మహ్ముదుల్లా, మెహదీ హసన్ మిరాజ్, రిషాద్, తస్కీన్, నాహిద్, ముస్తఫిజుర్.
తాజావార్తలు
-
CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
-
Upcoming IPOs : వచ్చే వారం మార్కెట్లో ఐపీఓల జాతర.. ఏకంగా 19 కంపెనీల ఎంట్రీ! పూర్తి వివరాలు ఇవే..
-
Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు…
-
Harish Rao : రాష్ట్రంలో రైతు రాజ్యం పోయి రాక్షస రాజ్యం వచ్చింది
-
UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!