గత కొంత కాలంగా ఫామ్‌తో తంటాలు పడుతున్న ‘కింగ్’ విరాట్ కోహ్లీ సరైన సమయంలో ఓ మేటి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఆదివారం దుబాయ్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో మెరిశాడు. 111 బంతుల్లో 7 ఫోర్లతో 100 పరుగులు చేశాడు. వన్డేల్లో ఇది కోహ్లీకి 51 సెంచరీ. చాలా కాలం తర్వాత వన్డేల్లో సెంచరీ చేసిన కోహ్లీకి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు కూడా లభించింది. వన్డేల్లో ఇది…
భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ఆ క్రేజే వేరు. ప్రతి ఒక్కరు దాయాదుల సమరం ప్రత్యక్షంగా చూడాలనుకుంటారు. ఈ క్రమంలో ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఆదివారం దుబాయ్‌లో జరిగిన ఇండో-పాక్ మ్యాచ్‌కు సెలబ్రిటీలు క్యూ కట్టారు. దేశవ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు ఈ మ్యాచ్‌కు హాజరయ్యారు. సినీ, వ్యాపార, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన హేమాహేమీలతో దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం కళకళలాడింది. మైదానం నలు మూలలా సెలబ్రిటీలు తళుక్కుమన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి మెగాస్టార్…
ఫామ్ లేమితో ఇటీవల తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఆదివారం దాయాది పాకిస్థాన్‌పై సూపర్ సెంచరీ (100 నాటౌట్: 111 బంతుల్లో 7 ఫోర్లు) చేశాడు. ఎక్కువగా రిస్క్ తీసుకోకుండా.. ఆచితూచి ఆడి వన్డేల్లో 51వ సెంచరీని పూర్తి చేశాడు. శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్‌తో కలిసి టీమిండియాకు అద్భుత విజయాన్ని అందించాడు. విరాట్ శతకం బాదడంతో అభిమానులు జోష్‌లో ఉన్నారు. కింగ్…
36 ఏళ్ల వయసులో విశ్రాంతి చాలా అవసరమని టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తెలిపాడు. విశ్రాంతి తీసుకుంటే మిగతా మ్యాచుల్లో రాణించడానికి దోహదం చేస్తుందన్నాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ (100 నాటౌట్: 111 బంతుల్లో 7 ఫోర్లు) సెంచరీ బాదాడు. శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్‌తో కలిసి మంచి భాగస్వామ్యాలు నెలకొల్పి టీమిండియాకు అద్భుత విజయాన్ని అందించాడు. ఇక మార్చి 2న న్యూజిలాండ్‌తో భారత్ మ్యాచ్ ఆడనుంది.…
విరాట్ కోహ్లీకి పాకిస్తాన్‌పై ఎన్నో రికార్డులు ఉన్నాయి. తాజాగా మరో రెండు రికార్డులను బద్దలు కొట్టాడు. మొదట ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు మహమ్మద్ అజారుద్దీన్ అత్యధిక క్యాచ్‌ల రికార్డును బద్దలు కొట్టాడు. బ్యాటింగ్‌లో మరో రికార్డు నెలకొల్పాడు. పాకిస్తాన్‌తో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో కోహ్లీ 14,000 పరుగులు పూర్తి చేశాడు.
ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ అద్భుతంగా ఆరంభించింది. పాక్ 241 పరుగులకు ఆలౌటైంది హర్షిత్ రాణా వేసిన 49.4 ఓవర్‌కు ఖుష్‌దిల్ షా (38) ఔటయ్యాడు. తొలుత పాకిస్థాన్ 47 పరుగుల వ్యవధిలో 2 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత పాకిస్థాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (47), సౌద్ షకీల్ (62) 104 పరుగులు జోడించారు.
IND vs PAK: భారత్ – పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఎప్పుడూ హైవోల్టేజ్, రసవత్తరంగా ఉంటుందనే సంగతి అందరికీ తెలిసిందే. టీ20 వరల్డ్ కప్ 2024లోనూ ఈ రెండు జట్ల మధ్య ఉత్కంఠభరితమైన పోరును క్రికెట్ ప్రేమికులు ఆస్వాదించారు. ఇప్పుడు దుబాయ్ వేదికగా మరోసారి భారత్ – పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. అయితే, ఈ మ్యాచ్ టై అయితే ఏమవుతుంది? విజేతను ఎలా నిర్ణయిస్తారు? అనే సందేహాలకు సమాధానం ఏంటో ఒకసారి చూద్దాం. Read Also: IND…
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా మరికొద్దిసేపట్లో చిరకాల ప్రత్యర్ధులు భారత్, పాకిస్తాన్ జట్ల తలపడనున్నాయి. దుబాయ్ వేదికగా మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. అయితే కీలక మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రాక్టీస్ సెషన్‌కు పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ డుమ్మా కొట్టాడు. దీంతో భారత్‌తో మ్యాచ్‌లో బాబర్ ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో బాబర్ నెమ్మదిగా ఆడిన విషయం తెలిసిందే. 90 బంతుల్లో 64 పరుగులు చేయడంతో అతడిపై…
IND vs PAK: దుబాయ్‌లోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్- పాకిస్తాన్ మధ్య బ్లాక్ బస్టర్ మ్యాచ్ జరగబోతుంది. ఈ రెండు జట్ల మధ్య పోరు ఉత్కంఠభరితంగా కొనసాగనుంది.
కింగ్ కోహ్లీ తుది జట్టులో కీ ప్లేయర్.. అతను ఫాంలో ఉన్న లేకపోయినా జట్టులో ఉంటే అదొక బలం అని చెప్పాలి. ప్రత్యర్థి ఎవరైనా కాస్త జాగ్రత్తగా ఉంటారు. ఈ రోజు పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ లో విరాట్ ఆడేది అనుమానంగా ఉంది. ఎందుకంటే ప్రాక్టీస్ చేసే సమయంలో కోహ్లీ కాలికి దెబ్బ తగిలినట్టు కనిపించింది.