పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోన్న తొలి ఐసీసీ టోర్నమెంట్ కావడంతో ప్రారంభ వేడుకలనూ గ్రాండ్ గా నిర్వహించాలని చూస్తుంది. ఫిబ్రవరి 16 లేదా 17న ఓపెనింగ్ సెర్మనీ ఏర్పాటు చేయనున్నారు. వార్మప్ మ్యాచ్‌లను బట్టి తేదీల్లో మార్పు ఉండే ఛాన్స్ ఉంది. అయితే, ప్రారంభోత్సవానికి ప్రతి టీమ్ కెప్టెన్ హాజరుకావాలి. పాక్‌కు వెళ్లేందుకు భారత సారథికి కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుందో, లేదో తెలియాల్సి ఉంది.
India Vs Pakistan: భారత్ vs పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అనేది క్రీడాభిమానులకు అసలైన ఉత్కంఠను కలిగించే ఓ సంఘటన. క్రికెట్ చరిత్రలో ఎన్నో చిరస్మరణీయ మ్యాచ్‌లు, సంఘటనలతో ఈ రెండు జట్ల మధ్య పోటీ ప్రత్యేకతను సంతరించుకుంది. ఇప్పుడు ఈ జట్ల మధ్య ఉన్న రైవల్రీపై నెట్‌ఫ్లిక్స్ ప్రత్యేక డాక్యుమెంటరీని తీసుకొస్తోంది. “ది గ్రేటెస్ట్ రైవల్రీ: ఇండియా వర్సెస్ పాకిస్థాన్” పేరుతో రూపొందిన ఈ డాక్యుమెంటరీ ఫిబ్రవరి 7న నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది.…
Adam Gilchrist: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ ఘాటు వ్యాఖ్యలు చేసాడు. టెస్ట్ ఫార్మాట్‌లో రోహిత్ పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో అతని భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని గిల్‌క్రిస్ట్ అభిప్రాయపడ్డాడు. రోహిత్ తన కెరీర్‌పై ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తర్వాత కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిపాడు. గతంలో ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు టెస్ట్‌ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. మూడు మ్యాచుల్లో ఆరు…
Champions Trophy 2025: 2025 ఫిబ్రవరి 19 నుంచి పాకిస్థాన్ వేదికగా ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి జట్టును ప్రకటించేందుకు ఐసీసీ జనవరి 12న గడువు తేది నిర్ణయించింది. అయితే, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) జట్టును ప్రకటించేందుకు మరింత ఆలస్యం కావచ్చు. తాజా సమాచారం ప్రకారం, బీసీసీఐ తన జట్టును సకాలంలో ప్రకటించడానికి ఐసీసీని మరికొంత సమయం డిమాండ్ చేయవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం, ఐసీసీ సూచనలకు అనుగుణంగా, టీమ్ ఇండియా చీఫ్ సెలెక్టర్…
BCCI Review Meeting: భారత జట్టు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో 1-3 తేడాతో పరాజయం పాలవడంతో, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ రేసు నుంచి దూరమైంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ టీమిండియా ప్రదర్శనపై సీరియస్ ఆలోచన చేస్తోంది. ఇందుకు సంబంధించి సోమవారం ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో సమీక్షా సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఇటీవల శ్రీలంకలో జరిగిన వన్డే సిరీస్ ఓటమి, న్యూజిలాండ్‌తో స్వదేశంలో 0-3తో ఓటమి, అలాగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఓటమికి గల కారణాలపై…
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆతిథ్యంపై అనిశ్చితి వీడిన విషయం తెలిసిందే. బీసీసీఐ కోరిక మేరకు హైబ్రిడ్ మోడల్‌లోనే టోర్నీ జరిపేందుకు పీసీబీ అంగీకరించింది. అయితే పీసీబీ కోరినట్లుగా 2024-27 మధ్య ఐసీసీ ఈవెంట్లలో ఇండో, పాక్ మ్యాచ్‌లు.. భారత్ లేదా పాకిస్థాన్‌లో ఎక్కడ జరిగినా తటస్థ వేదికలోనే నిర్వహిస్తారు. భద్రతా కారణాల దృష్ట్యా పాక్‌లో పర్యటించబోమని ఐసీసీకి బీసీసీఐ తేల్చిచెప్పడంతో.. పీసీబీ టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించేందుకు సిద్దమైంది. Also Read: IND vs WI: మెరిసిన…
గత కొన్ని నెలలుగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నిర్వహణపై నెలకొన్న అనిశ్చితికి తెరపడింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆతిథ్యమివ్వనున్న ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించనున్నట్లు గురువారం ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించింది. టీమిండియా మ్యాచ్‌లు తటస్థ వేదికలో జరుగుతాయని ఐసీసీ పేర్కొంది. 2027 వరకు భారత్‌లో జరిగే ఐసీసీ టోర్నీ మ్యాచ్‌లను పాకిస్తాన్ కూడా తటస్థ వేదికలో ఆడనుంది. ‘2024-2027 మధ్యలో భారత్, పాకిస్తాన్ దేశాల్లో జరిగే ఐసీసీ టోర్నీల్లో ఇరు జట్లు…
Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో బీసీసీఐ మాటే నెగ్గింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి పట్టుబట్టినట్లుగానే హైబ్రిడ్ మోడల్‌తో ఛాపియన్స్ ట్రోఫీని నిర్వహించాలని ఐసీసీ నిర్ణయం తీసుకుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వాలి. భద్రతా కారణాల దృష్ట్యా పాక్‌లో పర్యటించేది లేదని బీసీసీఐ ఇప్పటికే తేల్చి చెప్పింది. తాము ఆడే మ్యాచ్‌లను తటస్థ వేదికలకు మార్చి.. హైబ్రిడ్ మోడల్‌లో టోర్నీని నిర్వహించాలని ఐసీసీని కోరింది. హైబ్రిడ్ మోడల్‌కు పీసీబీ ముందుగా ఒప్పుకోకున్నా.. ఐసీసీ దెబ్బకు దిగొచ్చింది. అయితే హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించే విషయంపై పీసీబీ తన స్పష్టమైన వైఖరిని ఇప్పటికీ అధికారికంగా వెల్లడించలేదు. దీంతో షెడ్యూల్ విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఛాంపియన్స్…
2025 ఛాంపియన్స్ ట్రోఫీ జరిగే ఛాన్స్ కనిపించడం లేదని పాక్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ పేర్కొన్నారు. నేను కూడా అసలు ఈ టోర్నీ జరగకూడదని కోరుకుంటున్నాను.. ఐసీసీ తిరస్కరించేకంటే ముందే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వద్దని చెప్పాలని సూచించారు.