Champions Trophy 2025: 2025 ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై నేడు (డిసెంబర్ 11) తుది నిర్ణయం వెలువడే ఛాన్స్ ఉంది. పాకిస్థాన్ కూడా హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరిస్తుందని అందరూ అనుకుంటున్నారు. అయితే, భవిష్యత్తులో తమ మ్యాచ్‌లనూ ఇదే మోడల్‌ను అనుసరించాలని ఇప్పటికే పాక్ క్రికెట్ బోర్డు ఐసీసీ దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై ఐసీసీ నుంచి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు లిఖితపూర్వకమైన హామీని కోరింది. భారత్ ఆతిథ్యం ఇచ్చే టోర్నమెంట్లో తాము మ్యాచ్ ఆడే వేదికలను తటస్థ వేదికలో ఏర్పాటు చేయాలనేది పీసీబీ కండిషన్ పెట్టింది. దీనిపై ఇవాళ జరగనున్న భేటీలో చర్చించి నిర్ణయం తీసుకొనే ఛాన్స్ ఉందని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
Read Also: Robinhood : “రాబిన్ హుడ్” సినిమా వాయిదా.. ప్రచారంలో నిజమెంత ?
అయితే, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్ రిలీజ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు. ఐసీసీ సమావేశం మాత్రం పలుమార్లు వాయిదా పడుతూ వస్తోంది. నేటి సమావేశంలో షెడ్యూల్ ఖరారు చేస్తారని క్రికెట్ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఈ సందర్భంగా పాకిస్థాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ హాట్ కామెంట్స్ చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీ జరిగే అవకాశం కనిపించడం లేదన్నారు. వచ్చే సంవత్సరం పాక్ ఆతిథ్యంలో ఈ టోర్నమెంట్ జరగాల్సి ఉండగా.. బీసీసీఐ, పీసీబీ మధ్య సయోధ్య కుదరటం లేదన్నారు.
కాగా, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ జరిగే ఛాన్స్ కనిపించడం లేదని పాక్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ పేర్కొన్నారు. నేను కూడా అసలు ఈ టోర్నీ జరగకూడదని కోరుకుంటున్నాను.. ఐసీసీ తిరస్కరించేకంటే ముందే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వద్దని చెప్పాలని సూచించారు. పీసీబీ, ఏసీబీ, ఐసీసీ ఏదైనా సరే బీసీసీఐతో పోరాడలేవని ఆయన చెప్పుకొచ్చారు. ఎందుకంటే భారత్ బాయ్‌కాట్ చేస్తుందేమోననే భయం వారిని వెంటాడుతోంది అన్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మన స్టాండ్ ఎలా ఉండాలి? అని క్వశ్చన్ చేశాడు. ఐసీసీ లేదా ఏసీబీ కలిసి వస్తాయా? లేదా అనేది మనం (పాకిస్థాన్) ఆలోచించుకోవాలని మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ వ్యాఖ్యానించాడు.
Rashid Latif said “Pakistan should boycott the Champions Trophy now. Before BCCI takes this step, PCB should take it. Champions Trophy shouldn’t happen anymore” 🇵🇰🇮🇳🤯
— Farid Khan (@_FaridKhan) December 10, 2024