CM and Deputy CM Key Meeting: రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ.. వరుస ఘటనల నేపథ్యంలో ప్రాధాన్యత..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM and Deputy CM Key Meeting: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రేపు (మంగళవారం) జరగనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ల భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న వరుస అవాంఛనీయ ఘటనలు, పాలనాపరమైన అంశాలపై చర్చించేందుకు ఈ సమావేశం వేదిక కానుంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు మరియు ప్రజారోగ్యానికి సంబంధించి తలెత్తిన కొన్ని అంశాలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి.. దీంతో, ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.
* వేట్లపాలెం పేలుడు: కాకినాడ జిల్లా వేట్లపాలెంలోని బాణసంచా కేంద్రంలో జరిగిన పేలుడు ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. ఈ ప్రమాదానికి కారణాలు, బాధితులకు అందుతున్న సహాయం మరియు భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా తీసుకోవాల్సిన కఠిన చర్యలపై ఇరువురు నేతలు చర్చించనున్నారు.
Also Read
- Kakumanu Rajasekhar Death: వైసీపీలో విషాదం.. కాకుమాను రాజశేఖర్ ఆకస్మిక మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
- CM CBN Reviews on Heavy Rains: వర్షాలపై సీఎం చంద్రబాబు మరోసారి సమీక్ష.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
- AP Heavy Rains: వర్ష బీభత్సం.. విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం.. కొన్ని రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
- Flash Flood Alerts: ఏపీ, తెలంగాణలో ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు.. ఈ జిల్లాలకు ముప్పు..!
* అతిసార మరియు కల్తీ పాలు: రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో అతిసార వ్యాప్తి, అలాగే కల్తీ పాల నియంత్రణపై తీసుకోవాల్సిన చర్యలపై క్షేత్రస్థాయి నివేదికలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరిశీలించనున్నారు.
* టీటీడీ అంశంపై ప్రత్యేక చర్చ: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) చుట్టూ తిరుగుతున్న తాజా పరిణామాలు ఈ భేటీలో ప్రధాన అజెండాగా ఉండనున్నాయి. లడ్డూ కల్తీ మరియు వన్ మెన్ కమిటీపై చర్చించనున్నారు.. గతంలో సంచలనం సృష్టించిన లడ్డూ కల్తీ వ్యవహారం మరియు దానిపై విచారణ జరుపుతున్న వన్ మెన్ కమిటీ పురోగతిని వారు సమీక్షించనున్నారు.
* నామినేటెడ్ పోస్టుల భర్తీ: కూటమి ప్రభుత్వంలో కీలకమైన నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియపై కూడా ఈ భేటీలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రెండో విడతలో భర్తీ చేయాల్సిన పోస్టులు, పార్టీల వారీగా కేటాయింపులపై ఇరువురు నేతలు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని సమాచారం. అయితే, ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే అంశాలను సమర్థంగా తిప్పికొట్టడంతో పాటు, కూటమి పక్షాల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడం ఈ భేటీ ప్రధాన ఉద్దేశ్యంగా తెలుస్తోంది.
తాజావార్తలు
-
Turkey Earthquake: టర్కీలో భారీ భూకంపం.. 5.8 తీవ్రతతో కంపించిన భూమి
-
DoT SIM Card Warning: మీ పేరు మీద సిమ్‌ను వేరొకరు వాడుతున్నారా? మీకు రూ.50 లక్షల వరకు జరిమానా!, పైగా శిక్ష..
-
Faria: నేనింకా ఇల్లు కొనలేదు.. సందీప్ కిషన్ చెప్పాక కొనాలనుకున్నా.!
-
Danam Nagender: సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నా.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీ..!
-
Xiaomi TV: Xiaomi TV S Pro RGB-Mini LED 2027 సిరీస్ లాంచ్.. 98 ఇంచెస్ స్క్రీన్, Dolby Atmos, HyperOS 4
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!