Rohit Sharma: 2025 ఫిబ్రవరి 19వ తేదీ నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ స్టార్ట్ కానుంది. ఐసీసీ టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తుండటంతో భారత్ ఆడే మ్యాచులన్నీ దుబాయ్ వేదికగా జరగనున్నాయి. హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించేందుకు పాక్ బోర్డు అంగీకరించడంతో.. ఒక వేళ భారత్ సెమీస్, ఫైనల్‌కు చేరినా అవన్నీ దుబాయ్‌లోనే కొనసాగనున్నాయి. అయితే, 1996 తర్వాత పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోన్న తొలి ఐసీసీ టోర్నమెంట్ కావడంతో ప్రారంభ వేడుకలనూ గ్రాండ్ గా నిర్వహించాలని చూస్తుంది. ఫిబ్రవరి 16 లేదా 17న ఓపెనింగ్ సెర్మనీ ఏర్పాటు చేయనున్నారు. వార్మప్ మ్యాచ్‌లను బట్టి తేదీల్లో మార్పు ఉండే ఛాన్స్ ఉంది. అయితే, ప్రారంభోత్సవానికి ప్రతి టీమ్ కెప్టెన్ హాజరుకావాలి. పాక్‌కు వెళ్లేందుకు భారత సారథికి కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుందో, లేదో తెలియాల్సి ఉంది. ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు లేకపోవడంతో పాక్‌లో ఆడేందుకే జట్టును పంపించబోమని ఇప్పటికే బీసీసీఐ తేల్చి చెప్పింది. ఇప్పుడు కెప్టెన్ హోదాలో ఆ కార్యక్రమానికి రోహిత్ శర్మ హాజరవుతారా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది. బీసీసీఐ ప్రతినిధులు మాత్రం భారత కెప్టెన్ పాకిస్థాన్ వెళ్తాడని చెప్తున్నారు.
ఇక, టీమిండియా సారథి పాకిస్థాన్‌కు వెళ్తాడు.. పీసీబీ ఆతిథ్యం ఇవ్వనున్న ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొంటాడు అని బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు. పాక్ ఆధ్వర్యంలో 29 ఏళ్ల తర్వాత ఐసీసీ టోర్నీ జరగబోతుందన్నారు. పాక్ కు వెళ్లేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే.. భారత్ కెప్టెన్ లేకుండానే ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభ వేడుకలు కొనసాగుతాయా? లేదా? అనేది వేచి చూడాలి. పాక్ మాత్రం తమ దేశంలోనే ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పట్టుబట్టింది. పాక్- న్యూజిలాండ్ మ్యాచ్‌తో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభంకానుంది. పాకిస్థాన్‌తో దుబాయ్ వేదికగా ఫిబ్రవరి 23వ తేదీన భారత్ పోటీ పడనుంది. ఇప్పటి వరకు భారత్, పాక్ మాత్రం తమ స్క్వాడ్‌లను వెల్లడించలేదు. జనవరి 19 నాటికి టీమ్స్ ప్రకటించే అవకాశం ఉంది.