2025లో పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనున్న ఛాంపియన్స్ ట్రోఫీపై సందిగ్ధతకు తెరదించేలా ఐసీసీ (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్ లోనే నిర్వహించాలని ప్లాన్ చేస్తుంది. భారత మ్యాచ్‌లకు వేదికగా దుబాయ్‌ను ఎంపిక చేసిందని అనేక కథనాలు వస్తున్నాయి.
వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ 2025పై సందిగ్ధతకు తెర పడినట్లు తెలుస్తోంది. ట్రోఫీ విషయంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది. భారత్ ఆడే మ్యాచ్‌లకు దుబాయ్‌లో నిర్వహించనుంది. అంతేకాదు 2027 వరకు జరిగే ఐసీసీ టోర్నీల్లో భారత్‌లో పాకిస్తాన్ పర్యటించకుండా.. హైబ్రిడ్ విధానాన్ని కొనసాగించేందుకు ఐసీసీ అంగీకరించింది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 2025 ఫిబ్రవరి, మార్చిలో…
ఇవాళ (డిసెంబర్ 5కి) జరిగిన సమావేశం మరోసారి వాయిదా పడింది. అయితే, మరోసారి ఐసీసీ సమావేశాన్ని రెండు రోజులకు వాయిదా వేసినట్లు ప్రచారం జరుగుతుంది. పాకిస్థాన్ ఆతిథ్యంలోనే వచ్చే ఏడాది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సింది. కానీ, పాక్‌కు వెళ్లి ఆడేందుకు బీసీసీఐ ఒప్పుకోవడం లేదు. భద్రతా కారణాలతో అక్కడికి టీమిండియాను పంపించమని తేల్చి చెప్పింది.
వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ 2024పై ఉత్కంఠ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. గత కొన్ని నెలలుగా హైబ్రిడ్ మోడల్‌కు ఒప్పుకోని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ).. చివరకు ఐసీసీ దెబ్బకు దిగొచ్చింది. అయితే కండిషన్స్ పెట్టి ఓకే చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహిస్తే.. భవిష్యత్‌లో భారత్‌లో జరిగే ఐసీసీ ఈవెంట్లను కూడా తాము అదే మోడల్‌లో ఆడుతామని ఐసీసీకి పీసీబీ తెలిపింది. ఈ నేపథ్యంలో పీసీబీ పెట్టిన కండిషన్‌కు బీసీసీఐ కౌంటర్…
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025పై సందిగ్ధత ఇంకా కొనసాగుతూనే ఉంది. పాకిస్థాన్‌కు వెళ్లేది లేదని, హైబ్రిడ్ మోడల్‌లో అయితే టోర్నీ ఆడుతామని ఐసీసీకి బీసీసీఐ స్పష్టం చేసింది. పాక్‌లో మొత్తం టోర్నీ నిర్వహిస్తామని, హైబ్రిడ్ మోడల్‌కు తాము అస్సలు ఒప్పుకోమని పీసీబీ పేర్కొంది. మొండిపట్టు మీదున్న పాకిస్థాన్‌కు ఐసీసీ షాక్ ఇచ్చింది. హైబ్రిడ్ మోడల్‌కు ఒప్పుకోకుంటే.. టోర్నీ మొత్తాన్ని షిఫ్ట్ అవుతుందని పీసీబీకి ఐసీసీ చెప్పింది. దెబ్బకు దిగొచ్చిన పీసీబీ.. హైబ్రిడ్ మోడల్‌కు తాము సిద్దమే అని…
ICC Champions Trophy 2025 : వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే ఈ టోర్నీ నిర్వహణకు సంబంధించి బీసీసీఐ, పీసీబీ మధ్య వివాదం ముగియడం లేదు. ఇప్పుడు ఐసీసీ రెండు బోర్డుల మధ్య విభేదాలను పరిష్కరించడానికి వర్చువల్ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమయంలో టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించాలని ఐసీసీ పాకిస్థాన్‌పై ఒత్తిడి తెచ్చింది. ఇదిలా ఉంటే, పిసిబి ఇప్పుడు కొత్తగా బ్లాక్ మెయిల్ కు దిగింది. భవిష్యత్తులో…
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. పాకిస్థాన్‌లో పర్యటించేందుకు భారత్ నిరాకరించడంతో.. టోర్నీ షెడ్యూల్‌పై సందిగ్ధత నెలకొంది. హైబ్రిడ్ మోడల్‌లో మ్యాచ్‌లు నిర్వహిస్తే తాము ఆడేందుకు సిద్ధమని బీసీసీఐ స్పష్టం చేసింది. అయితే ఇందుకు పీసీబీ ఒప్పుకోవడం లేదు. పాకిస్థాన్‌లోనే పూర్తి టోర్నీ జరగాలని పట్టుపడుతోంది. ఐసీసీ చర్చలు జరిపినా.. పాక్ వెనక్కి తగ్గడం లేదు. హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరించేది లేదని గురువారం మరోసారి ఐసీసీకి పీసీబీ స్పష్టం చేసింది. ఇందుకు…
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఈనెల 29న కీలక సమావేశం ఏర్పాటు చేయనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో పాకిస్థాన్‌లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌ను ఖరారు చేసేందుకు వర్చువల్ (ఆన్‌లైన్) సమావేశాన్ని నిర్వహించనుంది.
Fire Accident In Hotel: వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనున్న నేపథ్యంలో పెద్ద తతంగమే నడుస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మహిళా క్రికెట్ జట్టు బస చేసిన హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆటగాళ్లు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ పెను ప్రమాదం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పిసిబి), వారి ప్రభుత్వ సన్నాహాలను బహిర్గతం చేసింది. ఇటువంటి పరిస్థితిలో, వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పాకిస్తాన్‌లో జరిగే…