ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానుల్లో ఎంతో ఉత్సాహం ఉంటుంది. కేవలం భారత్, పాక్ ఫ్యాన్స్ కాకుండా.. ఇతర దేశాల క్రికెట్ ఫ్యాన్స్ కు ఈ రెండు జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఎంతో ఎక్సైట్మెంట్ ఉంటుంది. కాగా.. ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. అయితే 23న భారత్-పాకిస్తాన్ మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది.
Read Also: HariHara VeeraMallu: పవన్ సినిమాకి మోక్షం.. చెప్పిన డేటుకే దించుతున్నారు!
కాగా.. ఈ మ్యాచ్‌కు సంబంధించిన టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఆన్‌లైన్‌లో విడుదల చేయగానే నిమిషాల్లోనే టికెట్లు ఖతమయ్యాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ మ్యాచ్ గరిష్ట టికెట్ ధర రూ. 1.20 లక్షలు. ఈ టికెట్లు కూడా పూర్తిగా అమ్ముడయ్యాయి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లోని భారత్ మ్యాచ్‌లు దుబాయ్‌లో జరుగనున్నాయి. కాగా.. భారత్-పాక్ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లను ఐసీసీ సోమవారం సాయంత్రం 5.30కు ఆన్‌లైన్‌లో ఉంచింది. ఈ క్రమంలో నిమిషాల్లోనే టికెట్లు అమ్ముడయ్యాయి. గరిష్ట టికెట్లు రూ. 47 వేలు, రూ. 1.20 లక్షల టికెట్లు కూడా అమ్ముడయ్యాయి. ఇతర మ్యాచ్‌ల టికెట్లన్నీ రూ. 2500 నుంచి ప్రారంభమైతే.. భారత్-పాక్ మ్యాచ్ టికెట్ ధరలు మాత్రం రూ. 10 వేల నుంచి రూ. 1.20 లక్షలుగా ఉండటం గమనార్హం.
Rahul Gandhi: రాహుల్ గాంధీపై “సభా హక్కుల తీర్మానం” ప్రవేశపెట్టనున్న బీజేపీ..
మరోవైపు.. ఆన్‌లైన్‌లో టిక్కెట్ బుక్ చేసే సమయంలో సైట్ స్లో అయిపోయింది. సుమారు 1,50,000 మందికి పైగా టక్కెట్ బుక్ చేసుకునేందుకు ఆన్‌లైన్‌లో క్యూలో ఉన్నారు. దీంతో బుకింగ్ వెయిటింగ్ టైమ్ గంటకు మించిపోయింది. దీంతో ఇండియా, పాక్ మ్యాచ్‌కు ఉన్న అపారమైన ప్రజాదరణ అంటే క్లియర్‌గా అర్థమవుతోంది. కాగా.. ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్తాన్, యూఏఈలో హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహిస్తారు. ఈ టోర్నీలో 8 జట్లు పాల్గొననున్నాయి. 19 రోజుల పాటు 15 మ్యాచ్‌లు జరుగనున్నాయి. గ్రూప్ Aలో బంగ్లాదేశ్, భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్ ఉండగా.. గ్రూప్ Bలో ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు ఉన్నాయి.