విదేశీ కరెన్సీ డిపాజిట్ల అంశంలో టిటిడికి ఉరట లభించింది.ఎవరికి ఇవ్వని మినహాయింపుని టిటిడికి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం.శ్రీవారికి భక్తులు సమర్పించిన కానుకలుగా విదేశి కరేన్సి బ్యాంకులో డిఫాజిట్ చేసుకునేందుకు సెక్షన్ 50 మేరకు టీటీడీకి మినహాయింపు ఇస్తూ కేంద్ర హోంశాఖ మినహయింపు ఇవ్వడంతో …గత మూడు సంవత్సరాలుగా జరుగుతున్న వివాదంకు పరిష్కారం లభించింది. అఖిలాండకోటి బ్రహ్మండ నాయకుడైన శ్రీవారి దర్శనార్దం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తూంటారు.స్వామివారి దర్శనార్దం తిరుమల విచ్చేసే భక్తులు తమ మ్రొక్కులు చెల్లింపులో భాగంగా హుండీలో కానుకలు సమర్పిస్తూంటారు.ఇలా శ్రీవారికి హుండిలో భక్తులు సమర్పించే కానుకలు ఏటా 1600 కోట్లు దాటగా….బంగారం వెయ్యి కేజిలు దాటుతుంది.ఇక వెండి అయితే నెలకి 500 కేజిల వరకు భక్తులు కానుకలగా సమర్పిస్తారు.
మరో వైపు స్వామివారి దర్శనార్దం విచ్చేసే భక్తులు స్వామివారికి కానుకలుగా విదేశి కరేన్సి కూడా సమర్పిస్తారు…ఇప్పుడు ఇదే టిటిడికి ఇబ్బందికరంగా మారింది.గతంలో స్వామివారికి భక్తులు సమర్పించిన విదేశి నాణేలను మార్పిడి చేసుకోవాడానికి టిటిడి నానా తిప్పలు పడింది.చిల్లర నాణేలు నిల్వలు టన్నులు కోద్ది వుండడం…నాటి విలువ కంటే….వాటి రవాణా చార్జిలే అధికంగా వుండడంతో చివరికి వాటిని టెండర్ల ప్రకియలో కేజిలుగా విలువకట్టి విక్రయించింది.మరో వైపు నోట్లను మాత్రం బ్యాంకులలో డిఫాజిట్ చేసుకుంటు వచ్చిన టిటిడికి…కేంద్ర ప్రభుత్వ నిభందనల మేరకు ఏఫ్ సిఆర్ఏ లైసెన్స్ పొందవలసి రాగా….2011లో టిటిడి కేంద్రానికి లైసేన్స్ జారి కోసం విజ్ఞప్తి చెయ్యగా…2015లో ఐదు సంవత్సరాల కాలపరిమితికి లైసేన్స్ జారి చేసింది కేంద్ర ప్రభుత్వం.కేంద్రం జారీచేసిన లైసెన్స్ 2020 జనవరికి కాలపరిమితి ముగిసే సమయంలో టిటిడి లైసెన్స్ రెన్యువల్ కోస0 2019లోనే అభ్యర్దించినా….అప్పట్లో మారిన చట్టం మేరకు టిటిడికి ఇబ్బందులు ప్రారంభమయ్యాయి.
Read Also: Lover Atrocity: ప్రేమను ఒప్పకోలేదని.. గదిలో బంధించి చిత్రహింసలు
రాష్ర్ట దేవాదాయచట్టం మేరకు శ్రీవారి హుండిలో భక్తులు సమర్పించిన కానుకలు కార్పస్ ఫండ్.దినితో స్వామివారికి భక్తులు సమర్పించిన కానుకలను డిఫాజిట్లుగా చేసి…వాటి పై వచ్చే వడ్డిని మాత్రం వ్యయం చెయ్యవలసి వుంటుంది.మరో వైపు సవరించిన కేంద్ర ప్రభుత్వ ఏఫ్ సిఆర్ఏ నిభందనల మేరకు ఫారిన్ కరేన్సిని బ్యాంకులో డిపాజిట్ చేసే సమయంలో కరేన్సి సమర్పించిన దాతల వివరాలు టిటిడి తెలపవలసి వుంటుంది…కాని టిటిడికి హుండి ద్వారా లభించే ఫారిన్ కరెన్సి దాతల వివరాలు వుండవు…వాటిని కోరే అధికారం టిటిడికి లేదు.ఇదే అంశాని కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకువెళ్ళిన…ఆ శాఖకు సంభంధించిన ఆడిటర్లు టిటిడి లేక్కలను పరిశిలించినా…కేంద్రం నుంచి టిటిడికి ఎలాంటి మినహయింపు లభించక పోగా….పైపెచ్చు నిబంధనలకు వ్యతిరేకంగా టిటిడి వ్యవహరించింది అని భావించింది కేంద్రం.
టీటీడీ 14 కోట్లు ఫైన్ విధించడంతో ఉలిక్కిపడింది.కేంద్రంతో సంప్రదించి ఆ ఫైన్ ని 3.19 కోట్లకు తగ్గించుకుంది. అటు తరువాత ఫైన్ తో పాటు లైసెన్స్ ఫీజుగా 18 వేలు చెల్లించి….లైసేన్స్ రెన్యువల్ చేసుకున్నా….టిటిడి గత మూడు సంవత్సరాలుగా చేస్తున్న విజ్ఞప్తికి మాత్రం కేంద్రం నుంచి సానుకూలత రాలేదు.ఫారిన్ కరేన్సి బ్యాంక్ లో డిఫాజిట్ చేసే సమయంలో నిభందనల మేరకు దాత వివరాలు తెలపాలనే కేంద్రం ఆదేశించడంతో పరిస్థితి మళ్ళి మొదటికి వచ్చింది….దినితో కేంద్ర హోంశాఖలో గతంలో పనిచేసిన అనభవం వున్న టిటిడి ఇఓ దర్మారెడ్డి సంప్రదింపులు ప్రారంభించారు.వాస్తవ పరిస్థితులు వారికి తెలియపర్చడంలో సఫలీకృతం కావడంతో ఎట్టకేలకు కేంద్రం దిగి వచ్చింది. ఏఫ్ సిఆర్ఏ చట్టం మేరకు దేశంలో మరేవ్వరికి ఇవ్వని మినహయింపుని టిటిడికి ఇచ్చింది కేంద్ర హోంశాఖ. ఏఫ్ సిఆర్ఏ చట్టం సేక్షన్ 50 మేరకు శ్రీవారికి భక్తులు హుండిలో సమర్పించిన కానుకలుగా విదేశి కరేన్సి ని బ్యాంకులో డిఫాజిట్ చేసుకునేందుకు అంగీకరించింది.దినితో ఫారేన్సి కరేన్సి మారకం పై టిటిడిలో నెలకొన్న సందిగ్దతకు పరిష్కారం లభించినట్లైంది.
Read Also: Heart Transplantation: శ్రీకాకుళం టు తిరుపతి.. గుండె తరలింపు