Bilkis Bano Case: బిల్కిస్ బానో పిటిషన్‌పై సుప్రీం విచారణ.. కేంద్రం, గుజరాత్ సర్కారుకు నోటీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bilkis Bano Case: 2002లో గోద్రా రైలు దహనకాండ అనంతరం గుజరాత్‌లో అల్లర్లు జరిగినప్పుడు తనపై అత్యాచారానికి పాల్పడ్డ దోషులను ముందస్తుగా విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ బాధితురాలు బిల్కిస్ బానో వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. బిల్కిస్ బానో దోషుల విడుదల కేసులో తమ స్పందన తెలియజేయాలంటూ కేంద్రం, గుజరాత్ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. రెమిషన్ మంజూరు చేయడానికి సంబంధించిన పత్రాలను ఏప్రిల్ 18లోగా సిద్ధం చేసుకోవాలని కేంద్రం, గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. బిల్కిస్ బానో పిటిషన్‌పై భావోద్వేగాలకు లోబడి తీర్పు ఇవ్వలేమని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ఈ కేసులో సవివరంగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని జస్టిస్ కె.ఎం. జోసెఫ్, జస్టిస్ బి.వి. నాగరత్నతో కూడిన ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది. దోషులకు రెమిషన్‌ను చట్టప్రకారమే మంజూరా చేశారా? అని సుప్రీం ధర్మాసనం ఈ సందర్భంగా ప్రశ్నించింది. దీనిపై తదుపరి విచారణను ఏప్రిల్ 18వ తేదీకి వాయిదా వేసింది.
అత్యాచారం కేసులో దోషులైన 11 మందిని విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ బిల్కిస్ బానో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. 2002లో జరిగిన గోద్రా అల్లర్ల సమయంలో 5 నెలల గర్భిణిగా ఉన్న బిల్కిస్ బానోపై దుండగులు పాశవికంగా అత్యాచారం చేశారు. అనంతరం ఆమె కుటుంబంలోని ఏడుగురిని హత్య చేశారు. ఈ కేసుపై విచారించిన సీబీఐ ప్రత్యేక కోర్టు.. 2008 జనవరి 21న 11 మందికి జీవిత ఖైదు విధించింది. 15 ఏళ్ల జైలు శిక్ష తర్వాత తమను విడుదల చేయాలంటూ దోషుల్లో ఒకరు సుప్రీంను ఆశ్రయించారు. దీనిని పరిశీలించాలని గుజరాత్ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. దీనిపై కమిటీని ఏర్పాటు చేసిన గుజరాత్ సర్కారు దోషులకు రెమిషన్ మంజూరు చేయాలని సిఫార్సు చేసింది. అయితే 14 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన వారికి గతేడాది ఆగస్టు 15న గుజరాత్ ప్రభుత్వం రెమిషన్ మంజూరు చేసింది.
Also Read
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం క్లారిటీ.. ఎప్పటి నుంచి అమల్లోకి అంటే..!
- 200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
- Komatireddy Venkat Reddy: తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఎల్బీనగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ కారిడార్‌కు ఆమోదం!
- Anaparthi Kidnapping Case: ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. 15 రోజుల తర్వాత తల్లిదండ్రుల ఒడికి చిన్నారి!
Read Also: Landslide: తీవ్ర విషాదం.. కొండచరియలు విరిగిపడి 16 మంది మృతి
దోషులు జైలు నుంచి విడుదలైన అనంతరం వారిని పూలమాలలతో సత్కరించడం, మిఠాయిలు పంచడం అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఈ నేపథ్యంలోనే దోషులకు రెమిషన్‌ను సవాల్ చేస్తూ బిల్కిస్ బానో సహా పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సత్ప్రవర్తన కారణంగానే వారికి శిక్ష తగ్గించినట్లు గుజరాత్ ప్రభుత్వం సుప్రీంకు ఇచ్చిన అఫిడవిట్‌లో పేర్కొంది.
తాజావార్తలు
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం క్లారిటీ.. ఎప్పటి నుంచి అమల్లోకి అంటే..!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Komatireddy Venkat Reddy: తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఎల్బీనగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ కారిడార్‌కు ఆమోదం!
-
Anaparthi Kidnapping Case: ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. 15 రోజుల తర్వాత తల్లిదండ్రుల ఒడికి చిన్నారి!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!