Anganwadi Centers: అప్‌గ్రేడ్ కాబోతున్న 2 లక్షల అంగన్వాడీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో అంగన్వాడీ కేంద్రాలు బలోపేతం కానున్నాయి. రాబోయే కాలంలో 6 ఏళ్లలోపు పిల్లలకు మెరుగైన పోషకాహారం అందించడం, ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి సేవలను బలోపేతం చేసే లక్ష్యంతో ఏడాదికి 40 వేల చొప్పున దేశవ్యాప్తంగా 5 ఏళ్ళలో 2 లక్షల అంగన్వాడీ కేంద్రాలను సాక్షం అంగన్వాడీ కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేయనున్నట్లు కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. రాజ్యసభలో వైసీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా బదులిస్తూ ఈ ఏడాది ఆశావహ జిల్లాల పరిధిలో 40 వేల అంగన్వాడీ కేంద్రాలను సాక్షం అంగన్వాడీలుగా అప్‌గ్రేడ్ చేయబోతున్నట్లు ఆమె చెప్పారు.
Read Also: Top Headlines @5PM: టాప్ న్యూస్
Also Read
సాక్షం అంగన్వాడీల్లో ఇంటర్నెట్, వైఫై, ఎల్ఈడీ స్క్రీన్లు, స్మార్ట్ లెర్నింగ్, ఆడియో విజువల్ పరికరాలు, చైల్డ్-ఫ్రెండ్లీ లెర్నింగ్ పరికరాలను సమకూర్చనున్నట్లు తెలిపారు.అలాగే న్యూట్రిషన్, ఎర్లీ చైల్డ్ హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ (ఈసీసీఈ)లకు సమాన ప్రాధాన్యత కల్పించే లక్ష్యంతో దేశ వ్యాప్తంగా ఉన్న మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా అపప్‌గ్రేడ్ చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈమేరకు తమ ప్రతిపాదనలు పంపంవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం ఎన్ని అంగన్వాడీ కేంద్రాలు, ఎన్ని మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయన్న మరో ప్రశ్నకు మంత్రి బదులిస్తూ 6837 మినీ అంగన్వాడీ కేంద్రాలు, 48,770 ప్రధాన అంగన్వాడీ కేంద్రాలతో కలిపి మొత్తం 55,607 కేంద్రాలు ఉన్నట్లు మంత్రి జవాబిచ్చారు. అంగన్వాడీల ద్వారా మెరుగైన సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ.
Read Also:Delhi liquor policy case: సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!