Covid-19: కరోనా డేంజర్ బెల్స్.. రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాల్సిందే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Covid-19: దేశంలో కొవిడ్ పరిస్థితులపై రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. కొవిడ్-19 నిర్వహణ, ప్రజారోగ్య సంసిద్ధతపై రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ మేరకు సూచనలు చేశారు. గతంలో కొవిడ్ పరిస్థితులను ఎదుర్కొన్నట్లుగా కేంద్ర, రాష్ట్రాలు సహకార స్ఫూర్తితో పనిచేయాలన్నారు. టెస్ట్-ట్రాక్-ట్రీట్-వ్యాక్సినేషన్-కొవిడ్ ప్రోటోకాల్ అమలును కొనసాగించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. రేపు, ఎల్లుండి జిల్లా స్థాయిలో ప్రజారోగ్య అధికారులతో కొవిడ్ సంసిద్ధతను సమీక్షించాలని రాష్ట్ర ఆరోగ్య మంత్రులను కేంద్ర ఆరోగ్యమంత్రి కోరారు.
ఏప్రిల్ 10, 11వ తేదీల్లో దేశవ్యాప్తంగా అన్ని ఆరోగ్య కేంద్రాల్లో కొవిడ్ మాక్ డ్రిల్స్ నిర్వహించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. రాష్ట్ర ఆరోగ్య మంత్రులు ఆసుపత్రులను సందర్శించి కొవిడ్ మాక్ డ్రిల్ కసరత్తులను సమీక్షించాలని కోరింది. కొవిడ్ కేసుల పెరుగుదలపై రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని, కొవిడ్-19 నిర్వహణ కోసం సంసిద్ధతతో ఉండాలని కేంద్ర సర్కారు సూచించింది. అత్యవసర హాట్‌స్పాట్‌లను గుర్తించాలని, కొవిడ్ పరీక్షలు, టీకాలు వేయడం , ఆసుపత్రి మౌలిక సదుపాయాల సంసిద్ధతను నిర్ధారించుకోవలని రాష్ట్రాలకు కేంద్రం సూచనలు చేసింది.
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
Read Also: Rishi Sunak: గర్వించదగ్గ రోజు.. సుధామూర్తికి దక్కిన గౌరవంపై స్పందించిన రిషి సునాక్
ఇదిలా ఉండగా.. దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నా యి. గతేడాది సెప్టెంబర్‌తో పోలిస్తే మళ్లీ ఇప్పుడే గరిష్టంగా కేసులు నమోదు అవుతున్నా యి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 6,050 కొవిడ్ కేసులు నమోదు అయ్యాయి. నిన్నటితో పోలిస్తే 13 శాతం ఎక్కు వగా కేసులు వచ్చాయి. గత ఏడాది సెప్టెంబర్ 16 తర్వాత ఇప్పు డే తొలిసారిగా కేసుల సంఖ్య
6 వేలను దాటింది. నిన్న ఒక్క రోజే 14 మంది మరణించారు. దేశంలో పెరుగుతున్న కేసులకు XBB1.16 వేరియంట్ కారణం అవుతోంది. అయితే ఈ వేరియంట్ మరణించేంత ప్రభావం చూపించదు కానీ, దీర్ఘకాలిక వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు ఉన్న వారిపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. వేగంగా వ్యాప్తి చెందుతోంది.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!