Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కీలక సూత్రధారి అయినటు వంటి మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావుకి కేంద్ర ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. ప్రభాకర్ రావు పాస్ పోర్ట్ రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రభాకర్ రావు పాస్ పోర్ట్ రద్దు అయినట్లు సిటీ పోలీస్ కి కేంద్ర సర్కార్ నుంచి సమాచారం వచ్చినట్లు తెలుస్తుంది. కాగా, ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసు ప్రక్రియ మొదలైనట్లు సిటీ పోలీస్ కి సీబీఐ అధికారులు సమాచారం ఇచ్చారు. అయితే, వైద్య చికిత్స కోసం అమెరికాకు వెళ్లి అక్కడే ప్రభాకర్ రావు ఉండి పోయారు.
Read Also: Tollywood : తమిళ ఇండస్ట్రీని డామినేట్ చేస్తున్న తెలుగు, కన్నడ ప్రొడ్యూసర్స్
అయితే, గత ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ గా విధులు నిర్వహించిన మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు.. పలువురు రాజకీయ నాయకులకు సంబంధించిన ఫోన్స్ ట్రాప్ చేసి వారి వ్యక్తిగత సంభాషణ దొంగలించినట్లు తేలింది. ఇక, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో విచారణ చేయగా.. అసలు విషయం బయటకు రావడంతో.. మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావు వైద్య చికిత్స కోసమని అమెరికాకు వెళ్లి ఇప్పటి వరకు తిరిగి రాలేదు.