Jagga Reddy: ప్రస్తుతం భారత్- పాకిస్తాన్ యుద్ధంపై చర్చ కంటే ఎక్కువ ఇందిరా గాంధీ ఉన్నప్పుడు జరిగిన యుద్ధం గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. 1971లో భారత్- పాక్ మధ్య భయంకర యుద్ధం జరిగింది.. అప్పుడు ప్రధాని ఇందిరమ్మ తీసుకున్న నిర్ణయాలు.. ధైర్యాన్ని యావత్ ప్రపంచం మెచ్చుకుంది.. ఇందిరా గాంధీ యుద్ధం చేసే సమయంలో కూడా ప్రతిపక్షంతో కూడా విమర్శలు రాకుండా చేశారని పేర్కొన్నారు. ఈ మధ్య జరగుతున్న పాకిస్తాన్- ఇండియా మధ్య యుద్ధంతో ఇందిరా గాంధీ జ్ఞాపకం వచ్చిందన్నారు. రాజకీయాలకు అతీతంగా ఇందిరమ్మ నిర్ణయాలపై ఇప్పుడు చర్చ జరుగుతుంది అని జగ్గారెడ్డి తెలిపారు.
Read Also: Truecaller: కొత్త ఫీచర్ లాంచ్ చేసిన ట్రూకాలర్.. ఏఐ టెక్నాలజీతో..
అయితే, అమెరికా అప్పట్లో కూడా యుద్ధం ఆపాలని చూసింది.. కానీ ఇందిరాగాంధీ ఊరుకోలేదని జగ్గారెడ్డి పేర్కొన్నారు. భారతదేశ ప్రజల నిర్ణయంలో తలదూర్చొద్దని బాహాటంగానే చెప్పారు.. తప్పని పరిస్థితిలో పాకిస్తాన్ ప్రధాని తల వంచారు అని గుర్తు చేసుకున్నారు. ఇక, అప్పుడు ఇందిరమ్మను అటల్ బిహార్ వాజ్ పాయ్.. అపర కాళీ అని ప్రశంసించారు.. పార్లమెంట్ లో రాజకీయాలకు అతీతంగా వాజ్ పాయి ఇందిరా గాంధీని పొగిడారు అని చెప్పుకొచ్చారు. కులం, మతం కాదు.. అందరూ ఆమెను అభినందించారని చెప్పుకొచ్చారు. ఇందిరా గాంధీ వస్తున్నారంటే.. మూడు రోజుల ముందే సభ పెట్టే స్థలంలో ప్రజలు ఉండే వారు.. నేను చిన్నగా ఉన్నప్పుడు ఆర్ఎస్ఎస్ శాఖకి పోయేవాడ్ని.. మా ఇంట్లో మా అమ్మ దుర్గా మాత ఫోటో పక్కన ఇందిరా గాంధీ ఫోటో పెట్టీ పూజించేది అన్నారు. గొప్ప కోసం కాదు.. నిజాలు కాబట్టి చెప్తున్నాను అని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పారు.
Read Also: Operation Sindoor: భారత్‌కి ప్రయోగశాలగా మారిన పాక్.. టర్కీ, చైనా ఆయుధాలు ఎక్స్‌పోజ్..
ఇక, ఆ రోజుల్లో ఇందిరా గాంధీ అంటే ఇండియా గాంధీ అని పిలిచే వాళ్లు అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. రాహుల్ గాంధీ కుటుంబం చరిత్ర ఇది.. ఇప్పుడు జరుగుతున్న యుద్ధంపై కంటే ఎక్కువ చర్చ ఇందిరమ్మ చేసిన యుద్ధం గురించి మాట్లాడుతున్నారు..
కాగా, బీజేపీ మాట్లాడే దానికి తోక, తొండం ఉండదు.. బీజేపీ వాళ్లకు ఏడ్వడం ఎక్కువ, చేయడం తక్కువని సెటైర్లు వేశారు. అమెరికా వద్దంటే ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం ఎందుకు యుద్ధం ఆపిందని ప్రశ్నించారు. మరోవైపు, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సీఎం రేవంత్ ని విమర్శించడం అంటే కాంగ్రెస్ పార్టీని తిట్టినట్లేనని చెప్పుకొచ్చారు. ప్రతీ పనికి మాలిన మాటలకు కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు.. నేను 19 ఏండ్ల క్రితం కౌన్సిలర్ నీ.. అప్పుడు ఈటల ఎక్కడ ఉన్నాడని ప్రశ్నించారు. నేను రౌడీలకు రౌడీ నీ.. మంచోడికి మంచివాడిని అన్నారు. కేసీఆర్ పార్టీ పెట్టకపోతే…ఈటెల ఎవరు?.. ఎవరో పుణ్యమాని లీడర్ అయ్యావు నువ్వు అని జగ్గారెడ్డి విమర్శలు గుప్పించారు.